Breaking News

జిల్లా పరిధిలో నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం సీజు చేయబడిన 1318.39 క్వింటాలు రా బియ్యాన్ని జూలై 31 న వేలం

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పరిధిలో నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం సీజు చేయబడిన 1318.39 క్వింటాలు రా బియ్యాన్ని జూలై 31 న వేలం వేయుటకు నిర్ణయించడ మైనదని జిల్లా జాయింట్ కలెక్టర్, కలెక్టర్ (పౌర సరఫరాలు) ఎన్. తేజ్ భరత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.తూర్పు గోదావరి జిల్లా నందలి రా రైస్ మిల్లర్లనకు, రైస్ షాపులు, కిరాణా షాపులు (హోల్ సేల్ మరియు రిటైల్) వారు సదరు వేలంలో పాల్గొనదలసినవారు రూ. 2,00,000/- రూపాయలు డిపాజిట్ గా డిమాండ్ డ్రాఫ్ట్ జాయింట్ కలక్టరు, తూర్పు గోదావరి జిల్లా , రాజమహేంద్రవరం వారి పేరున చెల్లించాలని తెలియ చేశారు. ది. 31.07.2023 మధ్యాహ్నం గం. 2.00 లోపు ప్రస్తుతము చేయుచున్న వ్యాపారమునకు సంబంధించిన వివరములు తెలుపుతూ సంబంధిత ధ్రువ పత్రము నకళ్ళు అనగా ఆధార్, జీఎస్టి, పాన్ కార్డు నకళ్ళు జతపరచి జాయింట్ కలక్టరు చాంబర్, కలక్టరేట్, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం నందు సమర్పించి శాంపిల్ పరిశీలించుకొని ది.31.07.2023 నాడు సాయంత్రం 6.00 గంటలకు నిర్వహించే వేలం లో పాల్గొనవచ్చునని తేజ్ భరత్ తెలిపారు. వేలం లో పాల్గొనదలచిన వారి పై ప్రస్తుతం/గతము లో ఏ విధమైన క్రిమినల్ మరియు 6-A కేసులు నిత్యావసరముల చట్టం ప్రకారం నమోదు కాబడి ఉండరాదని తెలియ చేశారు. ప్రస్తుతం CMR కార్యకలాపాలు సాగించే రైస్ మిల్లులు వేలం లో పాల్గొనటకు అర్హులు కారని ఆ ప్రకటనలో వెల్లడించారు.ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ నిమిత్తం సరఫరా చేసిన బియ్యం అక్రమంగా నల్ల బజారునకు తరలించుట చట్ట విరుద్ధమని ఆయన తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *