Breaking News

ప్రజల సహకారంతోనే పారిశుధ్యత సాధ్యం

-శానిటేషన్ సిబ్బందికి రైన్ కోట్లు పంపిణి,
-నగర కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ్యాంక్ అఫ్ బరోడా 116 వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ అద్వర్యంలో మధురానగర్ నుండి బి.ఆర్.టి.ఎస్ రోడ్ ఫూడ్ కోర్ట్ జంక్షన్ వరకు నేడు ర్యాలి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములో నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ పాల్గొని జెండా ఉపి ర్యాలిని ప్రారంభించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాని నగర కమిషనర్ కోరారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడతూ నగరంలో 64 శానిటరీ డివిజన్లలో గల 286 సచివాలయ పరిధిలోని శానిటేషన్ సిబ్బందికి ఇంటి నుండి వచ్చే చెత్తను వారి ఇంటి వద్దనే తడి పొడి మరియు ప్రమాదకర వ్యర్ధాలను వేర్వేరుగా విభజించి తడి చెత్తను ఆకుపచ్చ బుట్ట, పొడి చెత్తను నీలిరంగు బుట్టలో, ఎరుపు రంగు బుట్టలో ప్రమాదకర వ్యర్ధాలను వేసి నగరపాలక సిబ్బందికి అందజేయాలని పేర్కొన్నారు.

ప్లాస్టిక్ వినియోగం వల్ల వాతావరణం కలుషితం అగుటయే కాకుండా పారిశుధ్య నిర్వహణకు కూడా తీవ్ర అవరోధం కలిస్తున్నదని, ప్లాస్టిక్ సంచుల ద్వారా చెత్త మరియు వ్యర్దాములను డ్రెయిన్ లలో పడవేయట ద్వారా మురుగునీటి పారుదల మరియు యు.జీ.డి వ్యవస్థకు ఇబ్బందులు ఎదురౌతుందని, ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ కు బదులుగా ప్రత్యామ్నాయ జ్యూట్, పేపర్ లేదా క్లాత్ సంచులు మాత్రేమే వాడుకోవాలని పిలుపునిచ్చారు.

మన విజయవాడ నగరాన్ని మొదటి ర్యాంక్ సాదించుటకు ప్రతి ఒక్కరు వారి భాద్యతగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ నివారించి పర్యావరణాన్ని కాపాడుటలో భాగస్వాములై పరిసరాలు పరిశుభ్రతను పాటించాలని పిలుపునిచ్చారు.

తదుపరి శానిటేషన్ సిబ్బందికి కమిషనర్ చేతుల మీదుగా బ్యాంక్ అఫ్ బరోడా వారు అందిచిన 116 రైన్ కోట్లను పంపిణి చేశారు.

ఈ కార్యక్రమములో బ్యాంక్ అఫ్ బరోడా డిప్యూటీ జనరల్ మేనేజర్ & రీజినల్ హెడ్ విజయవాడ Mr. Chandan Sahoo, డిప్యూటీ రీజినల్ మేనేజర్ Mr. A.V.Bhaskaram మరియు ఇతర సిటీ బ్యాంక్ అఫ్ బరోడా సిబ్బంది, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *