Breaking News

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, రైతులకు మేలు చేసే రీతిలో

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు, రైతులకు మేలు చేసే రీతిలో ప్రజల వద్దకు సంక్షేమ పాలన, పథకాలు అమలు చేసే ప్రక్రియలో ప్రాధాన్యత భవనాలు నిర్మించడం జరుగుతోందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ పేర్కొన్నారు.బుధవారం రాజమహేంద్రవరం రూరల్ మండలం లో రాజవో లు, బొమ్మురు, పిడింగొయ్యి గ్రామాల్లో అర్భికే, సచివాలయం, హెల్త్ సెంటర్ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బి. రాజశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక మంచి సంకల్పం తో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. ఆమేరకు రాష్ట్ర అభివృద్ధిలో అంకిత భావంతో యువత పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ఇంజనీరింగ్ సహాయకులు గ్రామ స్థాయి లో చేపడుతున్న ప్రాధాన్యత భవనాల నిర్మాణ పనులలో నాణ్యత, నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చెయ్యాలని పేర్కొన్నారు. ఉన్నత విద్య వంతులైన సచివాలయ ఉద్యోగులు నిబద్దత కలిగి ఉండాలని, మీపై సిఎం కు అపారమైన నమ్మకం ఉందని, దానిని నిలబెట్టుకోవడం మీపై ఉందన్నారు. విధుల్లో భాగంగా చేపట్టే పనుల నాణ్యత ప్రమాణాల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మీ స్వంత ఇళ్ళ నిర్మాణం లో ఎలా ఆలోచన చేస్తారో, ప్రజలకు శాశ్వత పౌర సేవలు అందించే భవనాలు నిర్మాణం కోసం అదే విథమైన ఆలోచన తో ముందుకు వెళ్లాలని సూచించారు.ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ని తొలుత పంచాయతీ రాజ్ ఎస్సీ ఎ బి వి ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ డి. బాలాశంకర్ రావు కలిసి జిల్లాలో జరుగుతున్న పనుల ప్రగతిని వివరించారు. అనంతరం క్షేత్ర స్థాయి లో డ్వామా పీడీ జీ ఎస్. రామ్ గోపాల్, పంచాయతీ అధికారి, జిల్లా కో ఆర్డినేటర్ కె యస్ ఆర్మ్ స్ట్రాంగ్, , పిఆర్ ఆర్డబ్ల్యూఎస్ డి ఈ లు, ఏ ఈ లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *