– జిల్లాలో నమోదు చేసిన 5,79,067 సర్విస్ రిక్వెస్ట్లు
– జగనన్న సురక్ష ద్వారా అందించిన సేవలు – 5,77,753
– కలెక్టర్ కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి గత 4 ఏళ్లు లో సంతృప్తత స్థాయి లో పౌర సేవలు అందించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు .జగనన్న సురక్ష కింద సంతృప్తి స్థాయి లో గత 31 రోజుల్లో 5,77,753 మందికి సేవలు అందించడం జరిగిందని అన్నారు. మిగిలిన వాటిని కూడా అర్హత మేరకు సత్వరం పరిష్కారం చేస్తామని మాధవీలత అన్నారు.మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్, డి ఆర్వో జి. నరసింహం, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణితో కలిసి మీడియాతో కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ , సచివాలయ వ్యవస్థ ద్వారా 540 సేవలు ప్రజలకు అందించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో 99 శాతం మంది అర్హులకు నవరత్నాలు కింద పథకాలను ప్రజలకు చేరవేయడం జరిగిందన్నారు. మిగిలిన ఒక్క శాతం మందికి కూడా సేవలు, పథకాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగనన్న సురక్ష కింద వార్డు స్థాయి లో ఏడు రోజులు ఇంటింటి సర్వే నిర్వహించి, సేవా విజ్ఞప్తులను స్వీకరించడం జరిగిందన్నారు . ఎనిమిదోవ రోజు ఆయా గ్రామాల్లో, సచివాలయ పరిధిలో గ్రామ సభ సమావేశాలు నిర్వహించి ధ్రువ పత్రాలు అందజేశామన్నారు. పదకొండు శాఖల నుంచి ఉచితంగా సేవలు అందించేందుకు 5, 94, 139 సంబంధించి టోకెన్లు జారీ చేయగా వాటిలో 5,79,067 సర్వీసులను గుర్తించి 5,77,753 సేవలను లబ్ధిదారులకు అందించామని కలెక్టర్ మాధవీ లత పేర్కొన్నారు.జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న 512 సచివాలయలోని 6,51,015 కుటుంబాలకు గాను, 5,86,791 కుటుంబాలను 9,559 వాలంటీర్లు మరియు 3,937 సచివాలయ సిబ్బంది జగనన్న సురక్ష ప్రోగ్రాం లో భాగంగా మొత్తం 13,496 సిబ్బంది సర్వే చేయడం జరిగిందన్నారు. ఇందు కొరకు జిల్లా వ్యాప్తంగా 3 మునిసిపల్ కమీషనర్ లు, 21 మండల స్పెషల్ ఆఫీసర్ లు, 19 తహసిల్దార్ లు, 18 మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, 18 ఈవోపియర్డిలు, 19 డిప్యూటీ తహసిల్దార్ లు మొత్తం 98 మంది అధికారులు మరియు ఇతర మండల అధికారులు 44 టీం లుగా ఏర్పాటు చేయడం జరిగినదన్నారు.జిల్లాలో మొత్తం 6,51,015 కుటుంబాల ఉండగా వాటిలో సర్వే చేసిన కుటుంబాల సంఖ్య – 5,86,791 (90.13,%) కాగా సేవా టోకెన్స్ జెనరేట్ చేసిన సంఖ్య – 5,94,139 (101.30% ), సర్విస్ రిక్వెస్ట్లు నమోదు చేసిన సంఖ్య 5,79,067 (97.40%) కాగా – 5,77,753 (99.77%) సర్వీసులు అందించడం జరిగిందన్నారు.నవరత్నాలలో వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి సర్వేలో ప్రభుత్వ పథకాలలో లబ్ధి పొందని ప్రభుత్వం 15,241 మందిని గుర్తించామని, అర్హులైన వారి అందరికీ బై ఎన్యువల్ నందు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.’జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అందించిన సేవలు అంశాల వారీగా ఆదాయం ధ్రువీకరణ పత్రములు- 2,20,271, కుల ధ్రువీకరణ పత్రాలు-2,31,485 , ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్స్ రీ ఇష్యూయెన్స్- 35,865 , ఆర్ వో ఆర్ వన్ బిసర్టిఫికెట్లు -29, 691 , ఆదాయ ధ్రువ పత్రం రీ ఇష్యూయెన్స్ -26,015 , అడంగల్ సర్టిఫికెట్- 14,529 , ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్-11,460 , రైస్ కార్డ్ నందు వ్యక్తులను చేర్చుట – 2,346 , సి సి ఆర్ కార్డులు – 2067 , కొత్త రైస్ కార్డులు- 682 , రైస్ కార్డుల నుండి వ్యక్తుల ను విభజించుట – 519 , ఆరోగ్యశ్రీ కార్డు అప్డేషన్- 289 , ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్- 245 , కార్డ్ అడ్రస్ మార్పు -242 , నూతన ఆరోగ్యశ్రీ కార్డులు- 85 , మ్యారేజ్ సర్టిఫికెట్లు (రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు) – 81 మేర ధ్రువ పత్రాలు జారీ చేసామన్నారు . ప్రతి సేవలు అందించే క్రమంలో నిర్ణీత సమయం ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ మాధవీలత అన్నారు.
Prajavartha Online Telugu News