Breaking News

ఈఎపిసెట్ ఆడ్మిషన్ల ప్రక్రియలో స్వల్ప మార్పులు : కన్వీనర్ నాగరాణి

-ఆగస్టు 7వ తేదీ నుండి ఆప్షన్ల ఎంపిక ప్రారంభం
-17న సీట్ల కేటాయింపు, 21వ తేదీన క్లాసులు ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఈ ఎపిసెట్ అడ్మిషన్ల ప్రక్రియలో స్వల్పమార్పులు చోటు చేసుకున్నట్టు సాంకేతిక విద్యాశాఖ కమీషనర్, ప్రవేశాల కన్వీనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. షేడ్యూలును అనుసరించి బుధవారం నుండి ఆప్షన్ల ఎంపిక ప్రారంభం కావలసి ఉన్నప్పటికీ, దానిని ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసామన్నారు. రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కార్యకలాపాలకు సంబంధించిన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని కన్వీనర్ పేర్కొన్నారు. వెబ్ కౌన్సెలింగ్‌లో ఎంపికలు, మార్పులు, సీట్ల కేటాయింపు, సంస్థలలో నివేదించడం, తరగతుల ప్రారంభం వంటి అంశాలలో కూడా తదనుగుణంగా మార్పులు ఉంటాయన్నారు. ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఏడవ తేదీన ప్రారంభమై 12వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. 13 వతేదీన ఆప్షన్ల మార్పుకు కేటాయించామన్నారు. ఆగస్టు 17వ తేదీన విద్యార్ధులకు రిజర్వేషన్లను అనుసరించి అయా కళాశాలల్లో సీట్ల కేటాయింపు ఉంటుందని నాగరాణి వివరించారు. 17 నుండి 21వ తేదీలోపు సీట్లు పొందిన అభ్యర్ధులు అయా కళాశాలల్లో రిపోర్టు చేయవలసి ఉందన్నారు. ఆగస్టు 21వ తేదీనే క్లాసులు కూడా ప్రారంభం అవుతాయని కమీషనర్ స్పష్టం చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *