Breaking News

తొలి రోజు ఏపిపిఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న శాఖ పరమైన డిపార్ట్మెంట్ టెస్ట్ లకు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
తొలి రోజు ఏపిపిఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న శాఖ పరమైన డిపార్ట్మెంట్ టెస్ట్ లకు ఉదయం సెషన్ లో హాజరైన 482 మంది, మధ్యాహ్నం సెషన్ లో 287 మంది హజరైనట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్సిటిట్యూట్స్ నందు ఆగస్ట్ 2 నుంచి 7 వరకు శాఖ పరమైన పరీక్షలు నిర్వహించ నున్నట్లు  జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు పేర్కొన్నారు.
తొలి రోజు జరిగిన పరీక్షలకు ఉదయం పూట పరీక్షలకు 563 మంది ధరకాస్తు చేసుకోగా 482 మంది హాజరయ్యారని, 81 మంది హాజరు కాలేదని తెలిపారు. మధ్యాహ్నం పరీక్షకు 325 మంది ధరకాస్తు చేసుకోగా 297 మంది హాజరయ్యారని, 38 మంది హాజరు కాలేదని తెలిపారు. తొలి రోజు పరీక్షలు అత్యంత ప్రశాంతంగా ముగిసినట్లు తెలిపారు. పరీక్షలకు హాజర్యేందుకు తప్పని సరిగా హల్ టికెట్ తో మరో గుర్తింపు కార్డు తీసుకుని రావాలని కోరారు. పరీక్ష సమయం కంటే అరగంట ముందర ఉదయం 9.30 లోగా, మధ్యాహ్నం 2.30 లోగా పరీక్ష కేంద్రం లోపలికి రిపోర్ట్ చెయ్యవలసి ఉంటుందన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *