Breaking News

గ్రంధాలయాల అభివృద్ధితో పాఠకుల మన్ననలను పొందుతాం…

-పాఠకుల అందుబాటులోకి పుస్తక పంపిణీ కేంద్రాలు..
-2023`24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ అంచనాలు ఆమోదం..
-గ్రంధాలయ సంస్థ చైర్‌పర్సన్‌ టి. జమలపూర్ణమ్మ.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా గ్రంధాలయలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మౌలిక వసతులను కల్పించడం ద్వారా పాఠకుల మన్ననలను పొందేందుకు కృషి చేస్తున్నామని, 2023`24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఆమోదించడంతో పాటు పుస్తక పంపిణీ కేంద్రాలను పాఠకులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని గ్రంధాలయ సంస్థ చైర్‌సర్సన్‌ టి. జమలపూర్ణమ్మ తెలిపారు.జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వ సభ్య సమావేశం గురువారం విజయవాడ బందర్‌రోడ్డు ఠాగూర్‌ స్మారక గ్రంథాలయలలో చైర్‌పర్సన్‌ టి జమలపూర్ణమ్మ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాఖా గ్రంథాలయలలో మౌలిక వసతులను అభివృద్ధి పరచి పాఠకులకు మెరుగైన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 109 శాఖా గ్రంధాలయాలకు అదనంగా 161 పుస్తక పంపిణీ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. గ్రంథాలయాలను అభివృద్ధి పరిచేందుకు 2023`24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఆమెదిస్తూ తిర్మానం చేయడం జరిగిందన్నారు. గత బడ్జెట్‌లో సిబ్బంది జీత భత్యాలు, పెన్షన్లు, వాహన ఛార్జీ ప్రయాణ భత్యం, ఇతర పనులకు చెల్లించిన 7కోట్ల 73 లక్షల 82 వేల 798 రూపాయల ఖర్చులు ఆమెదించడం జరిగిందన్నారు. ఠాగుర్‌ స్మారక గ్రంథాలయం ఆదనపు భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్‌ 56 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని నిర్మాణ పనులు వేగవంతం జరుగుతున్నాయని త్వరలో నిర్మాణాలను పూర్తి చేసి పాఠకులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. జిల్లాలో గ్రాంథాలయలు లేని చోట్ల స్థానికల కోరిక మేరకు పుస్తక నిక్షిత కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 109 శాఖాగ్రంథాలయాలకు ఆదనంగా 161 పుస్తక పంపిణీ కేంద్రాలను ప్రారంభించుటకు అనుమతించామని ఇందుకు పత్రికల కొనుగోలుకు 1000 రూపాయలు, నిర్వహుల వేతనం కింద నెలకు 3000 రూపాయలు చెల్లించనున్నట్లు ఆమె తెలిపారు. శాఖా గ్రంథాలయలకు అవసరమైన కంప్యూటర్స్‌, స్టేషనరీ కొనుగోలుకు 3 లక్షల రూపాయలు మంజూరు చేసిన్నట్లు ఆమెతెలిపారు. పాఠకుల సౌకర్యార్థం 90 లక్షల రూపాయలతో పుస్తకాల కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. గ్రాంథాలయాలలో టాయిలెట్స్‌ ప్రహరీ గోడల నిర్మాణం అదనపు గదుల నిర్మాణానికి కోటి రూపాయలను మంజూరు చేయడంతో పాటు దృశ్య శ్రవణ పరికరాల కొనుగోలుకు 2 లక్షల రూపాయలను ఖర్చు చేసేందుకు సమావేశం తిర్మానించడం జరిగిందన్నారు. ఉమ్మడి జిల్లాలోని జమిగోల్వేపల్లి, గుడ్లవల్లేరు, గ్రాంథాలయాలలో దాతల సహకారంతో 905 పుస్తకాల కొనుగోలు చేసిన్నట్లు ఆమె తెలిపారు. తిరువూరు, జమీగొల్వేపల్లి, మల్లవోలు గ్రాంథాలయాలలో దాతల సహకారంతో సీలింగ్‌ ఫ్యాన్లు, ఐరన్‌ భీరువాలు, వాటర్‌ డిస్పెస్సర్‌, స్టీలు కుర్చీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సత్యనారాయణ పురం, చౌటపల్లి, మల్లవోలు, చిలకలపూడి, తిరువూరు, జి. కొండూరు, పెదోగిరాల మానికొండ శాఖా గ్రంధాలయాలలో పనికి రాని పుస్తకాలను రద్దు చేసేందుకు తిర్మాణించడం జరిగిందని ఆమె తెలిపారు. కంచికచర్ల శాఖా గ్రంథాలయంలోని వాటర్‌ మెటర్‌ రిపెర్లకు, రాజేంద్రనగర్‌ శాఖా గ్రంథాలయానికి త్రాగు నీటి సౌకర్యం కల్పించేందుకు బోరింగ్‌ పంపు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలోని గ్రంథాలయాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా పాఠకులకు మరింత సౌకర్యం కల్పించి జిల్లా గ్రంథాలయాలపై పాఠకులలో ఆసక్తిని కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చైర్‌ పర్సన్‌ జమలపూర్ణమ్మ తెలిపారు.సర్వసభ్య సమావేశంలో సభ్యులు వయోజన విద్యా ఉపసంచాలకులు యండి హజీబేగ్‌, సమాచార పౌర సంబంధాల అధికారి ఎస్‌.వి. మోహన్‌రావు, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వి రవికుమార్‌, సీనియర్‌అసిస్టెంట్‌ బి విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *