విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
63వ డివిజన్ లోని రాజీవ్ నగర్ లో 273 మరియు 274 వార్డు సచివాలయాలను నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ గురువారం సాయంత్రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షన్ 2023 ఫీడ్ బ్యాక్ వెరిఫికేషన్ మరియు సచివాలయాలలోని ఇన్స్పెక్షన్ రిజిష్టరు, నోటీసు బోర్డు, హాజరు రిజిస్టరు, స్పందన రిజిష్టరులతో పాటు వివిధ సంక్షేమ పథకాల రికార్డులను పరిశీలించారు.జగనన్న సురక్ష పథకం పారదర్శకంగా అందరికీ చేరువయ్యేలా సచివాలయాల సెక్రెటరీలు కృషి చెయ్యాలి అని కమిషనర్ గారు సూచించారు. సచివాలయాలలో పెండింగులో ఉన్న సేవలను గడువులోపు పూర్తి చేయాలని, సాంకేతిక అంశాలపై కార్యాలయం నుంచి నేరుగా సూచనలు పొందాలని కార్యదర్శులకు కమిషనర్ గారు సూచించారు. ఎస్.డి.జి సర్వే, భూహక్కు సర్వే, ఎ.పి సేవా పోర్టల్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, సూచించిన యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలని తెలిపారు.అదేవిధంగా స్పందన, జగనన్నకు చెబుదాం ఫిర్యాదులు, నాడు – నేడు పనుల పురోగతి, ఆస్థి పన్ను, యూజర్ చార్జీల వసూళ్ళను సచివాలయ కార్యదర్శులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు అందించే సేవల్లో నిబద్ధత పాటించాలని, తమకు నిర్దేశించిన పన్నుల వసూళ్ల లక్ష్యాలను గడువులోపు అందుకోవాలని సూచించారు. జగనన్న కాలనీ లే అవుట్ల నిర్మాణం పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని అమెనిటీస్ కార్యదర్శులను కమిషనర్ గారు ఆదేశించారు.ఈ పర్యటనలోలో నగర పాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
Prajavartha Online Telugu News