Breaking News

నేడు స్పందన రద్దు… జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం జిల్లాలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని ఈనెల 14వ తేది సోమవారం ఒక రోజు రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ప్రకటనలో తెలిపారు.జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు సిబ్బంది ఈనెల 15వ తేదిన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల విధులలో నిమగ్నమై ఉన్నందున 14వ తేది స్పందన కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే జిల్లా స్థాయి స్పందన కార్యక్రమంతో పాటు రెవెన్యూ డివిజనల్‌ మండల స్థాయిలో నిర్వహించే స్పందన కార్యక్రమం కూడా రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్‌ డిల్లీరావు ప్రకటనలో కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *