Breaking News

గృహ నిర్మాణాల‌ను వేగ‌వంతం చేయండి..

-స‌మీక్షా స‌మావేశంలో ఏపి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ యండి జి.లక్ష్మీషా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో గృహా నిర్మాణాల లక్ష్యాలను పూర్తి చేసి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి సిద్దం చేయాలని ఏపి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ యండి జి.లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల గృహాల ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్న దృష్ట్యా జిల్లాలో జరుగుతున్న గృహ నిర్మాణాల ప్రగతిని గురువారం నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో లక్ష్మిషా వివిధ స్థాయి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి మాట్లాడుతూ, జిల్లాలో 15,127 గృహ నిర్మాణాల లక్ష్యానికి గాను ఇప్పటికే 14,958కు పైగా నిర్మాణాలు పూర్తి చేశామ‌ని, తుది దశలో ఉన్న 169 గృహ నిర్మాణాలను వేగవంతం చేసి పూర్తి చేసి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారిగా పూర్తి చేయాల్సిన నిర్మాణాలలో ఎక్కువగా విజయవాడ సెంట్రల్ 56, పశ్చిమ 16, మైలవరం 15, జగ్గయ్యపేట 13, ఇబ్రహీంపట్నం 13, విజయవాడ రూరల్ 12 మండలాలలో ఉన్నాయని వీటిని పూర్తి చేసేలా గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. లేఅవుట్లలోని కాలనీల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి సిద్దం చేయాలన్నారు. ముఖ్యంగా సోక్పిట్స్, వెల్కమ్ ఆర్చన్, రహదారులు, విద్యుత్, త్రాగునీరు తదితర వసతులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో గృహ నిర్మాణాల శాఖ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ యం.రజినీకుమారి, నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ సత్యవతి, హౌసింగ్ ఎఇలు, డిఇలు, ఇఇలు, మండల ఇన్చార్జ్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *