Breaking News

స్పందన అర్జీలను నాణ్యతతో సకాలంలో పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన అర్జీలను నాణ్యతతో సకాలంలో పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలని జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు.
సోమవారం నగరంలోని కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ డా.పి. సపంత్‌ కుమార్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లు స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో అర్జీలు సమర్పిస్తారన్నారు. వాటిని పరిష్కరించాల్సిన భాధ్యత అధికారులపై ఉందన్నారు. స్పందనలో ఎక్కువగా నమోదవుతున్న వినతులను, అంశాలను విశ్లేషించుకోవడం ద్వారా భవిష్యత్తులో సమస్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు. నమోదు అవుతున్న అర్జీలకు నిర్థేశించిన గడువులోగా పరిష్కారం చూపాలని అదేవిధంగా ఎక్కువగా నమోదవుతున్న రెవిన్యూ వినతులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టవలసిన భాధ్యత ఉందన్నారు. గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో కూడా నిర్వహిస్తున్న స్పందనలో నమోదు అవుతున్న అర్జీలకు కూడా పరిష్కారం చూపాలనిఅధికారులకు సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందనలోనే కాకుండా జగనన్నకు చెబుదాం-1902 కాల్‌ సెంటర్‌, ఆన్లైన్‌ ద్వారను అర్జీలునమోదవుతుంటాయన్నారు. వాటికి నిర్ణిత వ్యవధిలో పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, పరిష్కారంలో అధికారులు ఎటువంటి అలసత్వం చూపరాదన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా ప్రాధమిక దశలోనే పరిష్కారం చూపాలని జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌ కుమార్‌ అన్నారు.స్పందనలో 140 అర్జీలు నమోదు…స్పందనలో ప్రధానంగా రెవిన్యూ 62, పోలీస్‌ 20, డిఆర్‌డిఏ 13, యంఎయుడి 10, వ్యవసాయం 6, సోషల్‌ వెల్ఫేర్‌ 5, గ్రామ, సర్వే అండ్‌ సెటిల్మెంట్‌ 3, విద్య 3, ఖజానా 3, పంచాయతీరాజ్‌ 3, వార్డు సచివాలయాలు 2, రవాణా అండ్‌ భవనాలు2, అటవీ 1, ప్లానింగ్‌ డిపార్టమెంట్‌ 1, వైద్య 1, బిసి వెల్ఫేర్‌ 1, ఇరిగేషన్‌ 1, ఏపిఎస్‌ఆర్‌టిసి 1, హౌసింగ్‌ 1, బ్యాంకు 1, లకు సంబంధించి అర్జీలు నమోదయ్యాయి.స్పందన కార్యక్రమంలో డిఆర్‌ డీఏ పిడి కె. శ్రీనివాస్‌, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎం. సుహాసిని, డీఈవో సివి రేణుక, డ్వామా పిడి జె.సునీత, వ్యవసాయ శాఖ జెడి ఎస్‌. నాగమణమ్మ, హౌసింగ్‌ పిడి రజిని కుమారి, ఉద్యాన శాఖ ఏ డి బాలాజీ కుమార్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *