విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు పశ్చిమ నియోజక వర్గం 37 వ డివిజన్ పరిధిలోని సీతమ్మవారి పాదాలు వద్ద విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ సమీపంలోని ఫ్లైఓవర్ దగ్గర “నా భూమి – నా దేశం – నేల తల్లికి నమస్కారం – వీరులకు వందనం” స్వాతంత్ర సమరయోధులకు దేశాన్నిరక్షించే సైనికుల త్యాగలకు కృతజ్ఞతలు తెలుపుతూ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి శిలాఫలక ఆవిష్కరణ చేసి తదుపరి మొక్కలు నాటి, విజయవాడ మునిసిపల్ ఉద్యోగులకు మొక్కలు పంపిణీ చేసి 2047 లోగ భారతదేశం అభివృద్ధి చెందిన దేశం గా చేయటానికి మా వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగినది..ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి. సత్యవతి , ఎ.డి.హెచ్ శ్రీనివాస్ గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (పార్క్స్) ఎ.ఎస్.ఎన్ ప్రసాద్ గారు, మేనేజర్ శ్రీనివాస్ , పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్ రజియా షబీనా , ఇతర మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు….
Prajavartha Online Telugu News