Breaking News

పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించండి..

-జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ జిల్లా కో`ఆర్డినేటర్‌ డా. జె.సుమన్‌..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు.

వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ద్వారా పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లా కో`ఆర్డినేటర్‌గా నియమిత్తులైన డా. జె. సుమాన్‌ మంగళవారం జిల్లా కలెక్టర్‌ను మర్యాదపుర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాల పున:వ్యవస్థీ కరణకు పూర్వం ఉన్న కృష్ణాజిల్లా కో`ఆర్డినేటర్‌కు పున:విభాజన అనంతరం ఏర్పాడిన ఎన్‌టిఆర్‌ జిల్లా భాధ్యతను అప్పగించడం జరిగిందన్నారు. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ద్వారా పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృష్ణా ఎన్‌టిఆర్‌ జిల్లాలకు విడివిడిగా కో`ఆర్డినేటర్లను నియమిస్తు ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమన్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లాలో మాత్రమే విధులు నిర్వర్తిచడం వలన పని వృత్తిడి తగ్గి ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై మరింత దృష్టి పెట్టే అవకాశం కలిగిందన్నారు.పేదలకు మెరుగైన వైద్య సేవలు తక్షణమే అందించేందుకు కృషి చేసి ప్రభుత్వం ఆశించే లక్ష్యాలను నేరవేర్చాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *