రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రైతులకు చెందిన మ్యూటేషన్ వివరాలను ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యడం ద్వారా పి ఎం కిసాన్ యోజన పథకం కింద ప్రయోజనం చేకూరడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు.మంగళవారం సాయంత్రం ప్రాధాన్యత రంగం సమీక్ష సమావేశం లో వ్యవసాయ అనుబంధ రంగాలలో భాగంగా మ్యూటేషన్ ఆధార్ ఈకేవైసి , ధాన్యం సేకరణ, ఈ క్రాప్ నమోదు, జగనన్న పాల వెల్లువ, గోడౌన్ ల నిర్మాణం స్థల సేకరణ, ధాన్యం కొనుగోలు, తదితర అంశాలపై మండల స్థాయి అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా జేసీ శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, పి ఎం కిసాన్ కింద ప్రయోజనం కలుగ చేసేందుకు రైతుల యొక్క భూమి పోర్టల్ అనుసంధానం చేయడం ద్వారా ఆమేరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో 1,07,000 మందికి చెందిన డేటా లో ఇంకా 4,750 మంది భూమి వివరాలు లింకేజ్ పూర్తి చెయ్యాలని అన్నారు. జిల్లాలో సిసిఆర్సీ కార్డుల జారీ లో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం లో ఉన్నందుకు వ్యవసాయ రెవెన్యూ అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 88,075 మంది కౌలు రైతుల లక్ష్యం కాగా 94,258 మందికి సి సి ఆర్ సి కార్డులు జారీ చేశామన్నారు. అదే విధంగా ఆయా కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వడానికి మండల స్థాయి లో చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ఆక్రమంలో గ్రామాల వారీగా, బ్యాంకు వారీగా కౌలు రైతుల వారీగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చెయ్యలన్నారు. ఆమేరకు క్షేత్ర స్థాయి లో ఎంపిడివో లు లీడ్ బ్యాంకు మేనేజర్ తో కలిసి ఏరియా వారీగా పెద్ద ఎత్తున రుణాలు మంజూరు కృషి చేయాలని కోరారు.ఈ క్రాప్ నమోదు వేగవంతం చేయాలని ఆదేశించారు. కనీసం గ్రామ వ్యవసాయ సహాయకులకు 50 ఎకరాల లక్ష్యం నిర్దేశించి వాటిని పూర్తి చేయాలన్నారు.గర్భధారణ కలిగి ఉన్న పశువుల కొనుగోలు చేయు నిమిత్తం ఇంకా 3 వేల పశువుల కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో 3 వేల మందికి జగనన్న పాల వెల్లువ కింద పశు కిసాన్ క్రెడిట్ కార్డు లు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు కార్యాచరణ ప్రణాళిక మేరకు గ్రామ స్థాయి సూక్ష్మ రూపం తీసుకుని రావాల్సి ఉందన్నారు. స్వల్ప కాలిక రుణాలు మంజూరు చేసే విధానం లో ప్రత్యేక అధికారులు, ఎంపిడివో లు సమన్వయం చేసుకుని, వారం వారం లక్ష్యం మేరకు రాబోయే నెలరోజుల్లో పూర్తి చెయ్యాలని అన్నారు.పశువుల కొనుగోలు విషయంలో దీర్ఘ కాలిక రుణాలు ఇవ్వడానికి, అదే క్రమంలో సక్రమంగా రుణాలు చెల్లిస్తున్న పశు రైతులకు రెండో రుణం ఇచ్చేలా బ్యాంకర్స్ తో సమావేశాలు నిర్వహించాలని అన్నారు. పశు సంచార వాహనాలు (1962) తప్పనిసరిగా గ్రామాల్లో పర్యటించి పశువైద్య సేవలు అందించాల్సి ఉంటుందన్నారు. ప్రతిరోజూ ఎనిమిది ట్రిప్స్ తిరగాల్సి ఉంటుందని ఆమేరకు పర్యవేక్షణ చేస్తూ, నిర్ధారణ చేయాలన్నారు. మండల స్థాయి లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.ఏం పీ ఎఫ్ సి (బహుళ ప్రయోజన ఫెసిలిటి సెంటర్) గోడౌన్ కింద ఫేజ్ 1లో 47 స్థలాలు, ఫేజ్ 2 లో 59 కి గాను 38 చోట్ల, ఫేజ్ 3 లో 30 చోట్ల కు గాను 13 స్థలాలను వెరసి మూడు ఫేజేస్ లో 136 స్థలాలు గుర్తించాల్సి ఉండగా 98 స్థలాలు గుర్తించడం జరిగిందన్నారు. మిగిలిన 38 స్థలాలు గుర్తించడం ద్వారా గోడౌన్ నిర్మాణాల చేపట్టడం లో వేగవంతం చేయాలని ఆదేశించారు. గోడౌన్ నిర్మాణానికి అనువుగా స్థలం ప్రాంతంలో స్థలాన్ని సేకరించాలని తెలిపారు.జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, జిల్లా పశు వైద్య అధికారి ఎస్ జి టి సత్యగోవింద్, మార్కెటింగ్ అధికారి ఎమ్. సునీల్ వినయ్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ ఏ. కుమార్, డి ఎస్ వో పి. విజయ భాస్కర్, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News