Breaking News

నవరత్నాలు – ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమం..

-జిల్లాలో ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హత గల 6,459 మంది లబ్దిదారులకు వివిధ పథకాల ప్రయోజనం గా రూ.7.38 కోట్లు జమ.
-జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ద్వైవార్షిక మంజూరు కింద అర్హత కలిగి మిగిలిన 6,459 మంది లబ్దిదారులుకు వివిధ పథకాల ద్వారా 7.38 కోట్ల రూపాయలను లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.గురువారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నవరత్నాలు – ద్వైవార్షిక నగదు మంజూరు కింద అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి లబ్ధి అందించడంలో భాగంగా వర్చువల్ ద్వారా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసారు. స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ జిల్లాలో ద్వైవార్షిక మంజూరు కింద అర్హత ఉన్న 6,459 మంది లబ్దిదారులను గుర్తించి వివిధ శాఖల అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కు చెందిన రూ.7.38 కోట్లను లబ్దిదారుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందని వారిని గుర్తించి మరో అవకాశం కల్పింస్తూ రాష్ట్ర ప్రభుత్వం పథకాల ప్రయోజనాన్ని లబ్దిదారులకు ఆందిస్తున్నామని పేర్కొన్నారు. ద్వైవార్షిక నగదు మంజూరులో భాగంగా ఇప్పటి వరకు జగనన్న చేదోడు క్రింద 13,491 మంది లబ్దిదారులకు రూ. 35.61 కోట్లు, వైఎస్సార్ ఈబీసీ పథకం క్రింద 19,782 మంది లబ్దిదారులుకు రూ. 53.99 కోట్లు, వైఎస్సార్ కాపునేస్తం క్రింద 29,824 మంది లబ్దిదారులకు రూ. 127.36 కోట్లు అందించామన్నారు.డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలను అందించాలన్నదే జగనన్న ప్రభుత్వం ఏకైక లక్ష్యం అన్నారు. అర్హులై ఉండి ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందని వారిని గుర్తించి వారికి కూడా నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ద్వైవార్షిక నగదు మంజూరు చేస్తూ వారి ఖాతాలకు జమ చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సోషల్ ఆడిట్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్దిదారుల జాబితాలు ప్రదర్శించి పారదర్శకతతో కుల మతాలకు అతీతంగా నూటికి నూరుశాతం లబ్దిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా వారి ఇళ్లకే అందింస్తున్నామన్నారు. 2022 సంవత్సరం డిశెంబరు నుంచి 2023 జాలై వరకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉండి పథకాల ప్రయోజనం పొందలేని 2,62,169 మంది అర్హులను గుర్తించి నేడు రూ.216.34 కోట్ల రూపాయలను నేడునేరుగా బ్యాంకు ఖాతాల్లో సీయం శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి జమచేసారని పేర్కొన్నారు.శాఖల వారీ లబ్దిదారుల వివరాలు :-వ్యవసాయ శాఖ సంబందించి 732 మంది లబ్దిదారులకు రూ. 67 లక్షలు, అమ్మఒడి కింద 521 మంది ల బ్దిదారులకు రూ. 8 లక్షలు, చేదోడు కింది 17801 మంది లబ్దిదారులకు రబూ. 1.78 కోట్లు, ఈబీసీ నేస్తం కింద రూ. 381 మంది లబ్దిదారులుకు రూ. 57 లక్షలు, జగనన్న వసతి దీవెన క్రింద 913 మంది లబ్దిదారులుకు రూ. 77 లక్షలు, జగనన్న విద్యా దీవెన క్రింద 1283 మంది లబ్దిదారులకు రూ. 1.85 కోట్లు, వైఎస్సార్ ఆసరా 3 వ విడతగా 843 మంది లబ్దిదారులకు రూ. 1.66 కోట్లు అందించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మెన్ ఆకుల వీర్రాజు, పిడి, డి.ఆర్డిఎ, ఎస్. సుభాషిణి, డి ఎల్. డి. ఓ లు, పి. వీణా దేవి, వీ. శాంతా మణి, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి యం. సందిప్, డి. ఎస్. ఓ, పి. విజయ భాస్కర్ , జిల్లా బిసి సంక్షేమ అధికారి పి ఎస్ రమేష్ బాబు, డిపియం. ఈ. రాజబాబు, లబ్దిదారులు తదిత రులు పాల్గొన్నారు.జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి రాజమహేంద్రవరం వారిచే జారీలబ్దిదారులు మనోభావాలు:-నాపేరు నరమామిడి భాగ్యలక్ష్మి మాది రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు మురళీకొండలో నివాసం ఉంటున్నాం. చేదోడు పథకం క్రింద నాకు జగనన్న రూ. 10 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా మంజూరు చేసారు. మంజూరు చేసిన ఈ ఆర్థిక సహాయంతో ఇస్తీపెట్టి కొని బట్టలు ఇస్తీ చేసుకొని జీవనం సాగించేందుకు ముఖ్యమంత్రి జగనన్న ఎంతోతోడ్పాటునిచ్చారని వారి మేలు మరువనని కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసారు.రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు నివాశి నాపేరు ముపిడి నవ్య తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ మాది మహాత్మాగాంధి స్వయంహాయక సంఘం మా గ్రూపు మీము మొదటి సారి సున్నావడ్డి రాలేదు. రెండవ విడత వాలెంటీర్ ద్వారా నమోదు చేసుకోవడం జరిగిన్నారు. మా గ్రూపుకు రూ. లక్షరూపాయలు వచ్చిందని, గ్రూపు సభ్యురాలినైన నాకు రూ.21 వేల రూపాయలు వచ్చింది. దాంతో కుట్టు మిషన్ కొని వ్యాపారం చేసుకుంటానని నవ్య ఆనందం వ్యక్తం చేస్తూ పేదల వర్గాల పక్షాన నిలబడి ఆదుకుంటున్న సీయం జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.రాజమండ్రి కొంతమూరు వాస్తవ్యులు వాకా సౌజన్య వారి అభిప్రా యం వ్యక్త పరుస్తూ అమ్మఒడి పధకం ద్వారా మా కుటుంబానికి 3 విడతలు సొమ్ము పడింది. మా అబ్బాయి ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. మాది పేద కుటుంబం అయినందు వల్ల మాకుటుంబానికి ఎంతో సహాయం చేసిన జగనన్నకు ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు.కొంతమూరు వాస్తవ్యులు తమ్మాన అన్నపూర్ణ వారి అభిప్రాయం తెలుపుతూ ఈ. బి. సి. నేస్తం పధకం ద్వారా 30 వేలు లబ్ది పొంది, మెడికల్ షాపు పెట్టి వ్యాపారం చేసుకుంటున్నాను. కుల, మత అనేవి లేకుండా జగనన్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందించడం వల్ల పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *