Breaking News

ఆగస్ట్ 30 న రాజమహేంద్రవరం లో రాష్ట్ర ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాక

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఆగస్ట్ 30 న రాజమహేంద్రవరం లో జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకలలో పాల్గొనడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు.సోమవారం ఉదయం స్థానిక మంజీర లో ముందస్తు భద్రత ఏర్పాట్లను ఎస్పీ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, శాసన సభ్యులు కుమార్తె వివాహ వేడుకల్లో భాగంగా రాజమహేంద్రవరం కి రావడం జరుగుతుందని అన్నారు. జిల్లా ఉన్నతస్థాయి అధికారులతో ముందస్తు భద్రతా ఏర్పాట్లను పరిశీలించామన్నారు. ఈ నేపథ్యంలో వివాహ వేదిక, హెలిప్యాడ్, రూట్ మ్యాప్ పాయింటింగ్ లను పరిశీలించడం జరిగింది.ఈ సందర్శన లో ఇంఛార్జి ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్, ఆర్డీవో ఎ. చైత్ర వర్షిణి, అదనపు ఎస్పీ ఎం. రజనీ, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *