Breaking News

నిబందనల మేరకు మాత్రమె నగరంలో బహుళ అంతస్తు భవనాలు నిర్మాణాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో బహుళ అంతస్తు నిర్మాణాలు ర్యాంప్ లు రోడ్ మీదకు రాకుండా, సెట్ బ్యాక్ లో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని, నిబందనలు పాటించని వాటికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయబోమని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ వసంతరాయపురంలో ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను, శారదా కాలని, మల్లిఖార్జున పేట, భారత్ పేట, శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబందనల మేరకు మాత్రమె నగరంలో బహుళ అంతస్తు భవనాలు నిర్మాణాలు జరగాలని, నిబందనలు ఉల్లంఘన చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ర్యాంప్ లు రోడ్ మీదకు రాకుండా చూడాలని, ఎల్.టి.పి.లు నూతనంగా బహుళ అంతస్తు భవనాలకు అనుమతుల కోసం ఆన్ లైన్ ద్వారా డి.పి.ఎం.ఎస్.లో తప్పనిసరిగా నిర్దేశిత ధ్రువ పత్రాలు, నిబందనలకు అనుగుణంగా దరఖాస్తు చేయాలని, లేకుంటే తదుపరి అనుమతుల జారీ నిలిపివేయడం జరుగుతుందన్నారు. మాస్టర్ ప్లాన్ ఎలైన్మెంట్ కాని, లేదా మాస్టర్ ప్లాన్ లో చేసిన భవన నిర్మాణాలకు ఆక్యుపెన్సీ అనుమతులు ఇవ్వబడవన్నారు. సెట్ బ్యాక్ పోర్షన్ లో, రోడ్ వైడినింగ్ పోర్షన్ లో ఎటువంటి నిర్మాణం చేసినా, నిర్ణీత ఎత్తు మించినా కూడా ఆక్యుపెన్సీ ఇవ్వడం జరగదన్నారు. అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం గ్రీనరికి కేటాయింపు ఉండాలని, రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్ లు నామమాత్రం కాకుండా పక్కాగా పని చేసేలా కనెక్షన్ చేయాలన్నారు. ర్యాంప్ లు రోడ్ల మీదకు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణాలు జరిగే సమయంలోనే వార్డ్ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నిర్దేశిత అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం నిర్మాణం జరుగుతున్నదీ లేనిదీ పరిశీలించాలని ఆదేశించారు. అలాగే ప్లానింగ్ కార్యదర్శులు తప్పనిసరిగా భవన నిర్మాణ అనుమతులు, ప్రణాళిక విభాగానికి సంబందించిన నిబందనలు, చట్టాలపై సమగ్ర అవగాహన కల్గి ఉండాలన్నారు.అనంతరం పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు పరిశీలించి కార్యదర్శులు తమ సచివాలయం పరిధిలో పారిశుధ్య పనులకు భాధ్యత వహించాలని, గ్యాంగ్ వర్క్ పనుల రిపోర్ట్ ప్రతి రోజు తమకు పంపాలన్నారు. డంపర్ బిన్ల దగ్గర అపరిశుభ్రం లేకుండా చూడాలని, సెకండరి కలెక్షన్ పాయింట్స్ నుండి నిర్దేశిత సమయంలో చెత్త తరలించాలన్నారు.పర్యటనలో సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, అసిస్టెంట్ సిటి ప్లానర్లు బాబురావు, టిపిఓ నాగ వల్లి, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *