గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లలను వారికి ఆసక్తి ఉన్న ఆటల్లో కూడా పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. గుంటూరు నగరం నుండి జాతీయ స్థాయి ఐస్ స్కేటింగ్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను శుక్రవారం కమిషనర్ ఛాంబర్ లో కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా ప్రదానమని, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధతో పిల్లలను ఆటలకు ప్రోత్సహించాలన్నారు. ఈ నెల 14 న నగరంలోని బిఆర్ స్టేడియంలో జరిగిన ఐస్ స్కేటింగ్ నేషనల్ సెలక్షన్ పోటీల్లో గుంటూరు నగరానికి చెందిన ఐకెఎస్ఏ స్కేటింగ్ అకాడమి క్రీడాకారులు 1 బంగారు, 5 వెండి, 2 కాంశ్య పతకాలు సాధించి డిశంబర్ లో గుర్గావ్ లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. గుంటూరు నగరంలోని పార్క్ ల్లో పిలల్లు ఆడుకోవడానికి ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నామన్నారు. త్వరలో గుంటూరులో స్కేటింగ్ రింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుంటూరు నగరం నుండి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా చిన్నారులకు శిక్షణ ఇచ్చిన స్కేటింగ్ కోచ్ లు ఇమ్రాన్, అప్సర్ లను అభినందిస్తున్నామన్నారు. రానున్న కాలంలో మరింత మంది క్రీడాకారులను తయారు చేయాలని కోరారు.
Prajavartha Online Telugu News