రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ODOP వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ) కార్యక్రమాన్ని చేపట్టి చేనేత రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పులుగుర్త కాటన్ ఫ్యాబ్రక్స్ ను గుర్తించడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరు మరియు జిల్లా మేజిస్ట్రేట్ డా.కె.మాధవీలత తెలిపారు. దేశీయంగా తయారు చేసే సాంప్రదాయ ఉత్పత్తుల్లో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి అవార్డును వర్తింపజేయడానికి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని పులుగుర్త అనే చిన్న గ్రామం వద్ద ఉన్న పులుగుర్త చేనేత నేత సహకార సంఘంకు చెందిన మల్ఖా, పులుగుర్త కాటన్ ఫాబ్రిక్ ఉత్పత్తి ఎంపిక చేయబడిందన్నారు. 1947 మార్చి 31 వ తేదీన పులుగుర్త చేనేత సహకార సంఘం స్థాపించబడి ఏప్రిల్ 14 వ తేదీన ప్రారంభించారన్నారు. పులగుర్త, మాచవరం, సోమేశ్వరం, కుతుకులూరు, పెడపర్తి, రామవరం, రామకోట, అనపర్తి గ్రామాల్లో ఈ చేనేత వృత్తిని చేసే కుటుంబాలు ఈ వస్త్రాలను నేస్తున్నట్లు పేర్కొన్నారు. మల్కా, పులుగుర్త కాటన్ ఫాబ్రిక్ దాని స్వంత సాంస్కృతిక ప్రాముఖ్యత, ప్రత్యేకమైన హస్తకళ మరియు మార్కెట్ సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. మల్ఖా వస్త్రం దాని స్థిరమైన మరియు పర్యావరణ అనుకూల ఉత్పత్తి ప్రక్రియకు ప్రసిద్ధి చెందింనట్లు కలెక్టరు తెలిపారు. ఇది స్థిరమైన మరియు పర్యావరణ అనుకూల వస్త్ర ఉత్పత్తిని ప్రోత్సహించడానికి సాంప్రదాయ కళాకారులు మరియు డిజైనర్లను కలిగి ఉన్న వికేంద్రీకృత విధానాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. మల్ఖా చీరల అంచులు ఎంతో ప్రత్యేకతను కలిగిఉండటమే కాకుండా తక్కువ బరువు ఉండటంతో వినియోగంలో ఎంతో మంది ఆసక్తి చూపడంలో ప్రసిద్ది చెందిందన్నారు. చక్కటి రంగల కలయికతో అనుకూలమైన ధరలతో అందుబాటులో ఉండటం ఈ చీరల, వస్త్రాల ప్రత్యేకత అని పేర్కొన్నారు. స్థానిక వస్త్రాల పై ఆధారపడిన సాంప్రదాయ చేనేత పద్ధతులను సంరక్షించడం, నేత కార్మికుల జీవనోపాధికి మద్దతు ఇవ్వడం మరియు స్థిరమైన మరియు పర్యావరణ అనుకూల వస్త్ర ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సొసైటీ కీలక పాత్ర పోషిస్తుందని, వారికి అండగా ప్రభుత్వం నిలబడి ఆర్థిక భరోసాను అందిస్తుందన్నారు. 290 పైగా చేనేత కుటుంబాలు ఈ వృద్ది పై ఆదారపడి జీవనం సాగిస్తూ ప్రతి ఏటా 1 కోటి రూపాయలకు పైగా వ్యాపారాన్ని ఎగుమతులు, వివిధ ప్రదేశాల్లో ప్రదర్శనల ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు. విలువ ఆధారిత పెంపు చేసే దిశలో ఈ ఉత్పత్తులకు ప్రత్యేకత ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోందన్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి అనే కార్యక్రమం మల్కా చేనేత వృత్తి దారులకు ఎంతో సహాయకారంగా నిలుస్తోందని కలెక్టరు డా. కే. మాధవీలత పేర్కొన్నారు. ఇది ఒక చక్కటి అవకాశమని ఈ ఉత్పత్తులను కొనసాగించడానికి ఎంతో దోహదపడుతుందని కలెక్టరు అభిలాషను వ్యక్తం చేసారు. భవిష్యత్తు తరాలు ఈ వృత్తిలో కొనసాగడానికి ఓడిఓపి చేదోడుగా నిలుస్తందనడంలో సందేహం లేదన్నారు. పులుగుర్త మల్కా శారీల, ఇతర ఉత్పత్తులు నాణ్యతా ప్రమాణాలను కొనసాగించడంలో ఓడీఓపీ ఎంతో తోడ్పడుతుందన్నారు. మార్కెటింగ్ సౌకర్యాలు జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తో పాటు ఆయా కుటుంబాలు మరింత ఆర్థిక బలోపేతం అవ్వడంతో పాటు మన దేశ,ప్రాంత సాంప్రదాయ ఉత్పత్తులకు తగిన గుర్తింపులు ఇవ్వడం సాద్యపడుతుందన్నారు. ఈ దిశలో కేంద్రప్రభుత్వం చేపట్టిన ఓడీఓపీ పధకం ద్వారా పులుగుర్తి వస్త్రాలకు మంచి ఆదరణ రానున్న రోజుల్లో లభించనున్నట్లు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News