Breaking News

సహిత విద్యా రిసోర్స్ పర్సన్స్ మెరిట్ జాబితా విడుదల

-సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు  బి.శ్రీనివాసరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సహిత విద్యా రిసోర్స్ పర్సన్ల మొత్తం అభ్యర్థుల మెరిట్ జాబితాను అక్టోబరు 11న (బుధవారం) https://apie.apcfss.in/ వెబ్ సైట్ నందు పొందుపరిచినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు  బి.శ్రీనివాసరావు  ప్రకటనలో తెలిపారు. పూర్వ అవిభాజ్య (erstwhile) పదమూడు జిల్లాల విద్యాశాఖాధికారుల ఆధ్వర్యంలో సర్టిఫికెట్స్ పరిశీలించి, ధ్రువీకరించిన తర్వాత ఈ జాబితా విడుదల చేసినట్లు తెలిపారు. సంబంధిత అభ్యర్థులు వెబ్ సైట్ సందర్శించి మీ మెరిట్ జాబితాను పరిశీలించుకోవాలని తెలియజేశారు. అభ్యర్థులకు మెరిట్ జాబితాలో సందేహాలు ఏమైనా ఉంటే సంబంధిత జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. అదేవిధంగా ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకు, మీ అప్లికేషను లో నమోదు చేసిన మొబైల్ నెంబర్ కు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి నుండి వచ్చిన సందేశాన్ని (మెసేజ్) అనుసరించి, జిల్లా విద్యాశాఖాధికారి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇచ్చిన ప్రకటన తేదీలను అనుసరించి, మీ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు. అనంతరం జిల్లాల్లో ప్రకటించిన ఖాళీలను అనుసరించి పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *