రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా ఖరీఫ్ సీజన్ 2023-24 లో రైతులు పండించిన ధాన్యానికి MSP అందించుటకు గాను జిల్లా యంత్రాంగం ఈ క్రింది చర్యలు చేపట్టియున్నారు
రైతులు తాను పండించిన ధాన్యాన్ని MSP కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు మధ్యవర్తులు, మిల్లర్సకు అమ్ముకోకుండాగా మరియు మిల్లర్స అక్రమంగా ఆన్లోడ్ ఛార్జీలు క్రింద డబ్బులు వసూలు చేయకుండాగాను రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయుటకు చర్యలు చేపట్టబడినవి. రైతులు తాను పండించిన ధాన్యం అమ్ముకొను విషయం లో మిల్లర్సని గాని మరియేతర మీడియేటర్సకు గాని కలవనవసరం లేకుండా ఒకసారి అర్భికే లో FTO/ ట్రక్ షీట్ తీసుకొన్న తదుపరి రైతు ధాన్యం ప్రభుత్వానికి అమ్మినట్లుగా తన ఇంటికి వెళ్లిపోవచ్చు తదుపరి సదరు ధాన్యం బాద్యతను ప్రభుత్వమే రైస్ మిల్లులలో ఆన్లోడ్ చేసి రశీదు పొందును. రైతు సదరు ధాన్యం ఆర్బికే లకు అమ్ముకున్న విషయం లో ఏదైనా అనుమానాలు వున్న యెడల సదరు విషయం ప్రభుత్వం వారి టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి వివరించిన యెడల సదరు విషయం పై చర్యలు చేపట్టి రైతుకు ఎమ్మెస్పి అందించుటకు చర్యలు చేపట్టబడును. తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2023-2024 సీజన్ లో అంచనా వేసిన వరి సేకరణ 2.52 లక్షల మెట్రిక్ టన్నులు గా పేర్కొని యున్నారు. 12.12.2023 నాటికి ధాన్యం సేకరణకు సంబంధించి 33374 కూపన్ లను జనరేట్ చెయుట జరిగింది. అందుకుగాను 20,863 మంది రైతుల నుండి 1,51,446.120 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చెయ్యడం జరిగినది. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి 20,256 FTO లకు గాను 212 కోట్ల 42 లక్షలు రైతుల ఖాతాలలో జమ చేయుట జరిగింది.ధాన్యం కొనుగోలు విషయమై సందేహాలు మరియు ఫిర్యాదుల కొరకు జిల్లా కలెక్టరు వారి కార్యాలయం వద్ద కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు అందుబాటులో కలదు. కంట్రోల్ రూమ్ నంబర్లు : 8309487151, 0883-2940788 – కలెక్టరు వారి కార్యాలయం, తూర్పు గోదావరి జిల్లా.
Tags Rājamahēndravaraṁ
Check Also
చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …
Prajavartha Online Telugu News