రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది సమ్మె పై జేసీ క్షేత్ర స్థాయి సిబ్బందితో బుధవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంగన్‌వాడీ కార్యకర్తల, హెల్పర్ ల ఐదు ప్రధాన డిమాండ్‌లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు జేసీ తేజ్ భరత్ తెలిపారు. పదోన్నతి వయస్సు 45 నుండి 50 సంవత్సరాల వరకు పెంపుదల. భారత ప్రభుత్వము నిబంధనల ప్రకారం పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచండం, సిడిపివో స్థాయిలో ప్రాజెక్ట్ స్థాయి అధికారి వద్ద జరిగిన సమావేశాలకు టూర్ ఎలవన్స్, దినసరి భత్యం బిల్లులను అందించడానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. సాధ్యత మరియు నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా మినీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చడం , అంగన్వాడీ వర్కర్స్ కోసం సేవా ముగింపు ప్రయోజనాన్ని రూ.50,000/- నుండి రూ.1,00,000/-కి మరియు అంగన్వాడీ హెల్పర్ కోసం రూ.20,000/- నుండి రూ.40,000/-కి పెంచడం పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ ప్రధాన డిమాండ్లను కల్పించాలని యూనియన్లు ప్రకటించి సమ్మెకు దిగాయని, వీటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన దృష్ట్యా సమ్మెను ఉపసంహరించుకుని, విధులకు హాజరుకావాలని విజ్ఞప్తి చేయాలన్నారు.
Prajavartha Online Telugu News