విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్,అట్లూరి పరమాత్మ గుహలు,శివగిరి కొండ పైన ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకి వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు. గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యలు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్,నాగార్జున నగర్ కాలనీ ప్రాంతాలలో దేవినేని సుధీర,11వ డివిజన్,ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్,పోస్టల్ కాలనీ రోడ్,Uphc రోడ్ ప్రాంతాలలో దేవినేని క్రాంతి, 19వ డివిజన్,వల్లూరు వెంకటేశ్వర రావు రోడ్,ABJ కాలనీ,పాపారావు స్ట్రీట్ ప్రాంతాలలో వై.సిద్దార్థ లు గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మహాన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల మాన్యుఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి హామీని అమలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకొన్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం 7వ డివిజన్ శివగిరి కొండపైన ప్రాంతాలలో పర్యటించిన అవినాష్ ఈ నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ఈ డివిజన్ లో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు వివరించి, మరలా అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టబోయే పనులను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి ప్రజలకు అండగా నిలిచాం కాబట్టే నేడు దమ్ముగా ధైర్యంగా ప్రజల ముంగిటకు వచ్చి చేసిన మంచి చెబుతున్నామని అన్నారు. మా కుటుంబ సభ్యులు దేవినేని సుధీర, దేవినేని క్రాంతి, వై.సిద్దార్థ్ లు కూడా 3,11,19 డివిజన్ లలో పర్యటించి మీ అవినాష్ అన్న హామీ కరపత్రాలు అందించి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివారిస్తున్నారని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసారని, నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి ఎన్నిసార్లు వినతిపత్రలు ఇచ్చిన అవన్నీ బుట్టదాకాలు అయ్యాయని విమర్శించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తూర్పు నియోజకవర్గంలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం అని దైర్యం గా చెప్తున్నాం అని అన్నారు.ప్రతిపక్షాలు తోక పత్రికలు ఎన్ని అవస్తవాలు ప్రచారం చేసిన ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి లేదని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ఆపడం ఎవరి తరం కాదని ధీమా వ్యక్తంచేశారు.ఈ పర్యటనలో 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక,కో అప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు ,11వ డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్,19వ డివిజన్ కార్పొరేటర్ రహేనా నాహీద్, కో అప్షన్ సభ్యులు సయ్యద్ అలీమ్ మరియు డివిజన్ ప్రెసిడెంట్లు,మండల ఇంఛార్జీలు,క్లస్టర్ ఇంఛార్జీలు,వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News