Breaking News

నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులు, అధికారులపై కఠిన చర్యలు తప్పవు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులు, అధికారులపై కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ నందివెలుగు రోడ్, ఎల్బి నగర్, బాలాజీ నగర్, పాత గుంటూరు తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి బస్టాండ్ రోడ్, నందివెలుగు రోడ్ మున్సిపల స్కూల్ ఎదురు చెత్త కుప్పలు ఉండడం పై సంబందిత సెక్రెటరి పై ఆగ్రహం వ్యక్తం చేసి, ఎల్.బి.నగర్ కల్వర్ట్ వద్ద అవుట్ ఫాల్ డ్రైన్ వ్యర్ధాలతో బ్లాక్ అయి ఉండడం పై సంబందిత శానిటేషన్ సెక్రెటరి, ఇన్స్పెక్టర్లకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఎంహెచ్ఓని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వార్డ్ సచివాలయం వారిగా ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలన్నారు. మధ్యాహ్నం ప్రాధాన్యత క్రమంలో గ్యాంగ్ వర్క్ జరగాలని, కార్మికులు, కార్యదర్శులు, ఇన్స్పెక్టర్ల హాజరు నివేదిక ప్రతి రోజు ఇవ్వాలని ఎంహెచ్ఓని ఆదేశించారు. సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు కొందరు విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని, క్షేత్రస్థాయి పర్యటనలో కార్యదర్శులు అనధికారికంగా విధులకు గైర్హాజరైనట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నందివెలుగు రోడ్ మున్సిపల స్కూల్ ఎదురు చెత్త కుప్పలు ఉండడం పై సంబందిత సెక్రెటరి జి.దాసు పై ఆగ్రహం వ్యక్తం చేసి, 2 రోజుల్లో సదరు ప్రాంతంలో వ్యర్ధాలు వేయకుండా ప్రజలకు అవగాహన కల్గించడం, ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం చేయాలని ఆదేశించారు. ఎల్.బి.నగర్ కల్వర్ట్ వద్ద అవుట్ ఫాల్ డ్రైన్ వ్యర్ధాలతో బ్లాక్ అయి ఉండడం పై సంబందిత శానిటేషన్ సెక్రెటరి డి.జ్ఞాన రత్నం, ఇన్స్పెక్టర్ ఎం.ఐజాక్ లకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఎంహెచ్ఓని ఆదేశించారు. శానిటరీ సూపర్వైజర్లు పారిశుధ్య పర్యవేక్షణలో మరింత పిన్ పాయింట్ గా పరిశీలించాలని ఆదేశించారు. ఈ-ఆటోల ద్వారా సేకరించిన వ్యర్ధాలను జిటిఎస్ లకు తరలించేప్పుడు సమయపాలన ఉండాలని, జిటిఎస్ దగ్గర ఆటోల ట్రిప్పుల రిజిస్ట్రర్ మైంటైన్ చేయాలన్నారు. జిటిఎస్ దగ్గర త్వరగా అన్ లోడ్ అయ్యేలా అదనపు సిబ్బంది, కాంపాక్టర్ లను అందుబాటులో ఉంచాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో ఎంహెచ్ఓ(ఎఫ్ఏసి) మధుసూదన్, శానిటరీ సూపర్వైజర్ ఆయుబ్ ఖాన్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *