Breaking News

Tag Archives: amaravathi

రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ లు దాఖలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, బాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు. సోమవారం అమరావతి అసెంబ్లీ భవనంలో సానా సతీష్,బాష్యం రామకృష్ణ,చింతకాయల విజయ్ లు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. వనితా రాణికి అందచేశారు. ఈ నామినేషన్ల దాఖలు ప్రక్రియలో కూటమి పార్టీ నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా సానా సతీష్ రెండు సెట్ …

Read More »

లింగ నిర్ధారణపై ఫిర్యాదుల‌ టోల్‌ఫ్రీ నంబ‌రు 1800 233 2447

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఆడ శిశువుల సంరక్షణ, మహిళా భ్రూణ హత్యల నివారణ కోసం అమలులో ఉన్న ప్రీ-క‌న్సెప్ష‌న్ అండ్ ప్రీ-నాట‌ల్ డ‌యాగ్నొస్టిక్ టెక్నిక్స్‌ ( PC&PNDT) చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ( 1800 233 2447 ) ను ప్రారంభించింది. గర్భంలో ఉన్న శిశువు ఆడా.. మగా.. అని చెప్పడం, తెలుసుకోవడం, అడగడం, ప్రోత్సహించడం వంటి చ‌ర్య‌లు చట్టరీత్యా నేరమని ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ జి.వీర‌పాండియ‌న్ …

Read More »

హెచ్. పి. వి. టీకా పంపిణీ గడువు మరో 3 నెలల పొడిగింపు

-3.45 లక్షల్లో ఇప్పటివరకు 78.57% మంది బాలికలకు వ్యాక్సినేషన్ -విద్యా సంస్థల పునః ప్రారంభం దృష్ట్యా మిగిలిన వారికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి -ఉన్నతాధికారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు -ఆందోళనక్కర్లేదు.. సంకోచం లేకుండా ముందుకు రావాలని తల్లిదండ్రులకు మంత్రి విజ్ఞప్తి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గర్భాశయ ముఖ ద్వారం (సర్వైకల్ క్యాన్సర్ కేసుల నిరోధానికి చేపట్టిన హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్. పి. వి.) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మూడు నెలల పాటు (ఆగస్టు వ‌ర‌కు) పొడిగించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య …

Read More »

ల్యాండ్ పూలింగ్ కింద మూడెకరాల భూమిని అందజేసిన ఉండవల్లి రైతులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి అనుమోలు తిరుపతి రాయుడు కుటుంబం ల్యాండ్ పూలింగ్ పథకం కింద తమ భూములను స్వచ్ఛందంగా సోమవారం అందజేసింది. ఉండవల్లి గ్రామ పరిధిలో తమ అధీనంలో ఉన్న మూడెకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం ఆ కుటుంబం APCRDA అధికారులకు అందజేసేందుకు తమ సమ్మతి తెలుపుతూ సంబంధిత పత్రాలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏ.జి. చిన్నికృష్ణ కి అందజేసింది. ఆ కుటుంబం నుంచి అనుమోలు తిరుపతి రాయుడు 55 సెంట్లు, అనుమోలు బేబీ జానకి …

Read More »

ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో “గ్రీవెన్స్ డే” నిర్వహణ..

-అర్జీలు స్వీకరించిన కమిషనర్, అడిషనల్ కమిషనర్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. రాజధాని రైతులు, గ్రామస్తులు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం అర్జీలను కమిషనర్ వి.విజయరామరాజు IAS, అడిషనల్ కమిషనర్లు ఏ.భార్గవతేజ IAS, కొల్లాబత్తుల కార్తీక్ IAS కు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని వారు తెలియజేశారు. అలాగే కొన్ని సమస్యల పరిష్కారం ప్రభుత్వ నిర్ణయానుసారం ఉంటుందన్నారు. …

Read More »

పవన్ కళ్యాణ్ చేపడుతున్న అనేక అభివృద్ధి, ప్రజాసేవ, సంక్షేమ కార్యక్రమాల్లో మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణాలు ఒక మచ్చుతునక లాంటివి

-సోమవరంలో మ్యాజిక్ డ్రెయిన్ పరిశీలించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు -మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణం ద్వారా దోమల బెడద, మురుగు నీటి దుర్వాసన తప్పిందని నాగబాబు కి సంతోషం వ్యక్తం చేస్తూ తెలిపిన స్థానిక మహిళలు 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ. 40 కోట్లతో 500 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించిన కె. నాగబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో ప్రగతితో కూడిన దూరదృష్టికి ప్రతిరూపం ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి …

Read More »

ఎరువుల పంపిణీలో పారదర్శకతకు ఏపీఎఐఎంఎస్ 2.0 దోహదం

– రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువుల పంపిణీ జరగాలి – కౌలు రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలి – కృత్రిమ కొరత, మళ్లింపులను అరికట్టేందుకు విజిలెన్స్ బృందాలు ఏర్పాటు చేయాలి – జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ఏపీఎఐఎంఎస్ 2.0 వ్యవస్థను విజయవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. …

Read More »

ఉమీద్ పోర్టల్ నమోదులో ఘన విజయం సాధించిన ఏపీ వక్ఫ్ బోర్డు

– 8,681 వక్ఫ్ సంస్థలు, 82,567 ఎకరాల వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్ పూర్తి – ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉమీద్ సెంట్రల్ పోర్టల్‌ అదనపు 6 నెలల గడువు జూన్ 6 తో ముగిసిందని, పోర్టల్ లో వక్ఫ్ ఆస్తుల నమోదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఘన విజయాన్ని సాధించిందని చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. గడువు ముగిసింది పాత వక్ఫ్ ఆస్తుల నమోదుకేనని నూతన రిజిస్ట్రేషన్ లకు …

Read More »

పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు పర్యటన

-సిద్ధాంతంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్న సీఎం -రైతులతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి -6 నెలల్లో 26.46 లక్షల పాస్ పుస్తకాలు రైతులకు అందజేత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల్లోని తప్పులను సరిదిద్దుతూ ప్రజా ప్రభుత్వం రైతులకు కొత్త పుస్తకాలను అందిస్తోంది. రైతుల సమక్షంలోనే రీ సర్వే చేసి వారి ఆమోదంతో పాస్ పుస్తకాలను ఇస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ నెలా మీ భూమి-మీ హక్కు …

Read More »

రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. పిడుగులతో కూడిన వర్షాలు కర్ణాటక పరిసర ప్రాంతాల నుండి కోస్తాంధ్ర తీరప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ …

Read More »