Breaking News

Tag Archives: amaravathi

జిఎస్టి వల్ల రాష్ట్రాల అదాయం తగ్గుతోంది…

-45వ జిఎస్టి మండలి సమావేశం దృష్టికి తీసుకు వచ్చిన బుగ్గన -సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిఎస్టి ప్రవేశ పెట్టక పూర్వం వార్షిక వృద్ది 17శాతం వరకు ఉండగా, ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్ధితులు నెలకొన్నాయని ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన లక్నోలో శుక్రవారం జరిగిన 45 వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం లో మంత్రి బుగ్గన …

Read More »

బ్రాండింగ్, ప్రమోషన్, అమ్మకాలు మరింత పెంచడమే లక్ష్యం : పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

-అవసరమైతే లేపాక్షి వస్తువుల కోసం ఒక బ్రాండ్ అంబాసిడర్ ఏర్పాటు… -ఆన్ లైన్ పోర్టల్ ద్వారా మరింత వినూత్న పద్ధతుల్లో అమ్మాలి, డెలివరీ వేగం పెంచాలి… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : లేపాక్షి హస్తకళారూపాలు సహా ఆప్కో వస్త్రాల అమ్మకాల విలువను పెంచేదిశగా బ్రాండింగ్ చేసే ఒక బ్రాండ్ అంబాసిడర్ నియమించే ఆలోచనను పరిశీలించాలని చేనేత,జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆ శాఖను ఆదేశించారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన చేనేత,జౌళి శాఖపై మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయం వేదికగా …

Read More »

ఆసరా, చేయూతలపై సీఎం సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్‌ ఆసరా, చేయూత కార్యక్రమాలపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో  బుధవారం సమీక్షించారు. ఆసరా కార్యక్రమం వివరాలను సీఎంకు అధికారులు వివరించారు.  మొదటి విడత ఆసరా కింద దాదాపు 8 లక్షల పైచిలుకు డ్వాక్రా గ్రూపులకు లబ్ధి, రూ.6330.58 కోట్ల రూపాయలను మహిళల చేతిలో పెట్టిన ప్రభుత్వం, రెండో విడత ఆసరా సన్నాహకాలను అధికారులు వివరించారు.  లబ్ధిదారుల జాబితాపై సామాజిక తనఖీ పూర్తయిందని, గ్రామ సచివాలయాల్లో కూడా ఆ జాబితాలను ప్రదర్శించామని అధికారులు తెలిపారు. …

Read More »

ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ ఫలితాలను విడుదల చేసిన ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి

-ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలను స్థాపిస్తాం : మంత్రి మేకపాటి -ఈ ఏడాదే పాలిటెక్నిక్ కాలేజీల్లో 5 కొత్త టెక్నికల్ కోర్సులు ప్రవేశపెడుతున్నాం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలను స్థాపిస్తామని ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ సంవత్సరం నుండే పాలిటెక్నిక్ కాలేజీల్లో ఐదు కొత్త టెక్నికల్ కోర్సులు ప్రవేశపెడుతున్నట్ల ఆయన స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలోని సమావేశమందిరంలో మంత్రి గౌతమ్ రెడ్డి.. పాలిసెట్ -2021 …

Read More »

దిశ బిల్లు మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచింది…

-బాదిత మహిళలకు సత్వర న్యాయం అందజేయడంలో దోహదపడుతున్నది -ఆపద సమయాల్లో మహిళలకు తక్షణమే రక్షణ కల్పిస్తున్న దిశ యాప్ -దిశ బిల్లు చట్ట రూపం దాల్చకపోయినా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది -ప్రతిపక్ష నాయకులు బిల్లును చించివేయడం మహిళలను అవమానించినట్లే అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దిశ బిల్లు చట్ట రూపం దాల్చకపోయినా మహిళల్లో ఆత్మస్థైర్యాన్నిపెంపొందించేందుకు ఎంతగానో దోహదపడుతున్నదని, అటు వంటి బిల్లును ప్రతిపక్ష నాయకులు చింపివేయడం మహిళలను అవమానించడంతో సమానమని రాష్ట్ర మహిళా అభివృద్ది, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి …

Read More »

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ పై సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు, పాలిటెక్నిక్‌లు, ఐటీఐలపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో  సోమవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధికోసం ఒక కాలేజీని పెట్టబోతున్నామన్నారు. విశాఖపట్నంలో హై ఎండ్‌ స్కిల్‌యూనివర్శిటీని, తిరుపతిలో స్కిల్‌యూనివర్శిటీని పెట్టబోతున్నామన్నారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో పాఠ్యాంశాల రూపకల్పన, పాఠ్యప్రణాళిక అనేది హై ఎండ్‌ స్కిల్స్‌ యూనివర్శిటీ, స్కిల్‌యూనివర్శిటీలు రూపొందిస్తాయమన్నారు.  కోడింగ్, లాంగ్వేజెస్, రోబోటిక్స్, ఐఓటీ లాంటి అంశాల్లో పరిజ్ఞానాన్ని పెంచేలా నైపుణ్యాభివృద్ధి …

Read More »

కోర్టు కేసుల పురోగతిపై స్పష్టత, సమీక్ష తప్పనిసరి…

-ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ -మనుపాత్ర పేరిట కేసుల వేగవంతం కోసం ప్రత్యేక యాప్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోర్టు కేసుల విషయంలో ఎటువంటి అలసత్వం కూడదని, సమయానుసారంగా కేసుల పురోగతిపై స్పష్టత కలిగి ఉండాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ వివిధ విభాగాల అధిపతులను ఆదేశించారు. న్యాయస్ధానాలకు అవసరమైన సమాచారాన్ని సకాలంలో అందించాలని, కేసులకు సంబంధించిన వ్యవహారాలను ఎప్పటి కప్పుడు సమీక్షిస్తూ ఉండాలని స్పష్టం చేసారు. సోమవారం సచివాలయంలో పర్యాటక, భాషా సాంస్కృతిక, …

Read More »

వాతావరణ సూచన…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతం. ఈ ఆవర్తనం ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం. తదుపరి 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం. దీని ప్రభావంతో రాగల 4 రోజులు పాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం. పశ్చిమ బెంగాల్ , …

Read More »

కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్, వైద్య,ఆరోగ్యశాఖపై సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్, వైద్య,ఆరోగ్యశాఖపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో  బుధవారం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ… కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎంకు అధికారులు వివరాలందించారు. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 14,452 రికవరీ రేటు 98.60 శాతం 10,494 సచివాలయాల్లో యాక్టివ్‌ కేసులు నమోదు శాతం జీరో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 3,560 మంది కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 926 …

Read More »

దశలవారీ మద్య నిషేధానికి ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉంది…

-గత ప్రభుత్వ హయాంలో 4380 మద్యం దుకాణాలుంటే వాటిని 2934కి తగ్గించాం -43వేల బెల్టు షాపులను,4380 పర్మిట్ రూమ్ లను రద్దు చేశాం -గతంలో మద్యం షాపుల సమయాలు ఉ.10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకు ఉండగా ప్రస్తుతం ఆసమయాలను ఉ.11గం.ల నుండి రాత్రి 8గం.లకు పరిమితం చేశాం -2018-19లో 661 లక్షల మద్యం బాక్సులు విక్రయిస్తే 2021లో 224 లక్షల బాక్సులు వినియోగం -దశల వారీ మద్య నియంత్రణ చర్యలతో 63శాతం మద్యం వినియోగం తగ్గింది -రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్,వాణిజ్యపన్నులు కె.నారాయణ …

Read More »