-వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డుకు రూ.10లక్షలు నగదు,జ్ణాపిక -వైయస్సార్ అచీవ్మెంట్ అవార్డుకు రూ.5లక్షలు నగదు, జ్ణాపిక -ఆగష్టు 14 లేదా 15వతేదీన అవార్డులు ప్రధానం -పూర్తిపారద్శకత నిష్పాక్షికతతో అవార్డులకు ఎంపిక ప్రభుత్వ సలహాదారు కమ్యునికేషన్స్ జివిడి కృష్ణమోహన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2021 ఏడాదికి సంబంధించి వైయస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, వైయస్సార్ అచీవ్మెంట్ కింద 63 అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో …
Read More »Tag Archives: amaravathi
సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు…
-మంచి వ్యక్తి : చంద్రబాబు -సూపర్ స్టార్ కృష్ణ సాహసానికి మారు పేరు : మెగాస్టార్ చిరంజీవి -మీరు చూపించిన మార్గానికి ధన్యవాదాలు నాన్నా: మహేశ్ బాబు -మీరంటే ఎప్పటికీ గౌరవం : విజయశాంతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు చిత్రసీమలో మొట్టమొదటి సూపర్ స్టార్ కృష్ణ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మే 31 సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు. సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, అభిమానులందరూ సోషల్ మీడియా వేదికగా కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. సోషల్ మీడియాలో ఆయనపై జన్మదిన …
Read More »మీమల్ని మీరు అన్ని రకాల ప్రయోగాల నుండి రక్షించుకునే సుదర్శన మంత్రం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎటువంటి బాధలు తొలగించబడతాయో ఈ శ్లోకంలో వివరంగా ఉంది అటువంటి బాధలు అనుభవిస్తున్న వారు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు మీ సమస్యలు తీరే వరకు రోజూ చదవాలి తగిన పరిష్కరం చూపిస్తుంది సమస్య నుండి విముక్తి పొందుతారు. ఇది బాధ అనుభవిస్తున్న వారు చేస్తే త్వరగా ఫలితం ఉంటుంది చదవలేని పరిస్థితి ఉన్న వారు 108 సార్లు మనసు లగ్నం చేసి ఆడియో విన్నా పర్వాలేదు కానీ జపించడం వల్ల మీకు మోనో ధైర్యం …
Read More »ఇలలో పరమ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి
-శ్రీకాళహస్తి ఆలయ ప్రత్యేకతలు తెలిస్తే…తప్పక దర్శించుకోవాలనుకుంటారు… అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : ఈ క్షేత్రంలో ఆలయంలోకి వెళ్లకుండానే కైలాసగిరుల ప్రదక్షిణ చేస్తే పరమశివుని దర్శించుకున్నట్లే. దక్షిణ కాశీలు చాలా ఉన్నాయి. దక్షిణ కైలాసం మాత్రం ఒక్కటే ఉంది.’ అంటారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. కైలాసగిరుల ప్రదక్షిణ కోసం ఆయన శ్రీకాళహస్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి క్షేత్రమహాత్యం గురించి వివరించారు. ఆ విశేషాలివీ… శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. వాయువు అంటే ప్రాణం. వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది. …
Read More »వయోవృద్ధులు కోవిడ్ బారి పడకుండా సూచనలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు కోవిడ్ బారి పడకుండా కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు AIIMS ద్వారా విడుదల చేయబడిన సూచనలు. 60 ఏళ్లు పైనబడిన సీనియర్ సిటిజన్లు COVID కాలంలో ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. సీనియర్ సిటిజన్స్ మరియు వారి సంరక్షకులు కోవిడ్ ప్రమాదము నుండి వారు ఎలా రక్షించుకోవాలో కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు AIIMS కొన్ని సలహాలు సూచనలు విడుదల చేయడం జరిగింది. 60 మరియు …
Read More »ప్లాస్మా దానం చేయండి ప్రాణాలు కాపాడండి…
అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : ప్లాస్మా అంటే ఏమిటి… రక్తం కావాలంటే వెంటనే వచ్చి ఇస్తున్నారు, ప్లాస్మా అనగానే బయపడుతున్నారు. మన రక్తంలో నీటి మాదిరిగా ఉండే పసుపుపచ్చని ఫ్లూయిడ్ నే ప్లాస్మా అంటారు. కరోనా వంటి వైరస్ లు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్లరక్త కణాలు గుర్తించి, చంపేందుకు కావలిసిన యాంటీబాడీలు తయారవుతుంటాయి. ఆ యాంటీ బాడీలు ప్లాస్మాలోనే ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మా లోనూ ఈ యాంటీ బాడీలు పెద్దసంఖ్యలో తయారై ఉంటాయి. అందువల్ల …
Read More »ఏసీ @ 26 డిగ్రీలు!
-ఈ ఉష్ణోగ్రత వద్దే సెట్ చేసుకొని.. ఏసీలు వాడుకోండి -దీనివల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా లబ్ధి -కరెంటు బిల్లులు, కర్బన ఉద్గారాలూ తగ్గుతాయి -స్టార్ రేటెడ్ గృహోపకరణాల వినియోగంతో భారీ ప్రయోజనాలు -గృహ వినియోగదారులకు ఏపీఎస్ఈసీఎం సూచన -స్టార్ రేటెడ్ ఉపకరణాల వినియోగం, ఏసీలు 26 డిగ్రీల వద్ద నడపడంపై విస్తృత అవగాహన కల్పించండి -ఏపీఎస్ఈసీఎం అధికారులకు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ ఆదేశం -0 స్టార్ ఏసీతో పోల్చితే 5 స్టార్ ఏసీ వల్ల ఏడాదికి రూ.2500 ఆదా -26 డిగ్రీల వద్ద నడిపితే …
Read More »సపోటా పండ్లను వేసవిలో తీసుకుంటే ఎంత మేలో తెలుసా?
నేటి పత్రిక ప్రజా వార్త : వేసవి కాలంలో మనకు దొరికే పండ్లలో సపోటా ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చెట్లు వేడి ప్రదేశాలలో ఎక్కువగా పెరుగుతాయి. ఈ పండు మామిడి, పనస వర్గాలకు చెందింది. అంటే దీనిలో చాలా ఎక్కువ కేలరీలు ఉంటాయి. సపోటా తినడానికి చాలా రుచికరంగా ఉండటం వలన దీనిని మిల్క్ షేక్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ పండ్లలో విటమిన్ ఏ, బి, సి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. …
Read More »స్వీయ గృహనిర్బంధం…
-స్వీయ గృహనిర్బంధం (HOME ISOLATION ) అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొరోనా పాజిటివ్ అవగానే అందరికీ ఫోనులు చేసి బెంబేలెత్తి నన్నాసుపత్రిలో చేర్చండి అని ఏడ్చి కంగారు పడి సింపతీకొట్టకుండా.,ధైర్యంగా స్వీయ గృహనిర్బంధం ద్వారా కొరోనాను ఏవిధంగా ఎదుర్కోవాలనో తెలుసుకోండి. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు మొదలుకాగానే ఇంట్లో వాళ్ళకి నేను ఐసోలేషన్ కి వెళుతున్నా అని చెప్పి ఒక రూమ్ లోకి వెళ్ళాలి..అదేదో వనవాసం వెళుతున్నట్లు.. 300 రూపాయల మందుల కిట్టు మొదలెట్టాలి RTPCR పాజిటివ్ అవుతానే.. కొంచెం ధైర్యం …
Read More »కరోనా సెకండ్ వేవ్ – మన ఆరోగ్యం మన చేతుల్లోనే…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. అటు దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. మన రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గతంలో కంటే సెకండ్ వేవ్ లో వైరస్ వ్యాప్తి మరింత వేగంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మాస్కు ధరించాలి. గుంపులు గుంపులుగా తిరగకూడదు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. మన ఇంటి నుంచే మొదలవ్వాలి… కరోనా …
Read More »
Prajavartha Online Telugu News