Breaking News

Tag Archives: guntur

భూములు ఇచ్చిన రైతులకు పరిహా పరిహారపు నిధులు విడుదల

-గుంటూరు ఛానల్ విస్తరణకు భూములు ఇచ్చిన ఏడు గ్రామాల రైతుల ఖాతాల్లో జమ -7 గ్రామాల రైతులకు రెండో దఫా చెల్లింపుగా రూ.17.58 కోట్ల విడుదల -తొలి దఫా పరిహారంగా ఇప్పటికే రూ.10.54 కోట్లతో వెరసి రూ. 28.12 కోట్లు చెల్లింపు -సహకరించిన సీఎం చంద్రబాబు నాయుడుకి పెమ్మసాని కృతజ్ఞతలు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు ఛానల్ అభివృద్ధి పనులోని పలు దశలను, సమస్యలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఒక్కోటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఛానల్ ఆధునికీకరణ, విస్తరణ పనులకుగానూ …

Read More »

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక…

-కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 1వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

“యాంటీ మలేరియా మాసం – జూన్ 2026”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా జూన్ నెలను “యాంటీ మలేరియా మాసం – జూన్ 2026” గా నిర్వహిస్తున్నట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన “మలేరియా నిర్మూలన వైపు …

Read More »

విద్యతోనే అత్యుత్తమ స్థానాలు

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -పేదల విద్యకు కుల సంఘాలు బాసటగా నిలవడం అభినందనీయం -కూటమి రాకతో ప్రభుత్వ విద్యకు మహర్దశ -ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం -సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండాలి -ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా పేదల విద్యకు అండగా ఉంటున్నా : మంత్రి సవిత -104 మంది విద్యార్థులకు భక్త కనకదాస పురస్కారాలు -కురమ సంఘ సౌజన్యంతో పురస్కారాలు అందజేసిన మంత్రి సవిత -సొంత నిధులతో విద్యార్థులకు మంత్రి సవిత ప్రోత్సాహకాలు -నలుగురికి …

Read More »

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన చేసిన నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 3న పివియస్ లలితా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను … పరిశీలించి, అన్ని పకడ్బందీగా చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్, పర్యటన మార్గం, హాస్పిటల్ ల్లో ప్రారంభోత్సవ విభాగాలు, సభా వేదిక, హాస్పిటల్ వెలుపల పారిశుద్యం పరిశీలించి తగిన ఏర్పాట్లు చేయాలని జిఎంసి ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. పర్యటనలో లలితా హాస్పిటల్ డాక్టర్ రాఘవ శర్మ, ఆర్డీఓ శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్ బి. …

Read More »

ఏ.బి.సి. సెంటర్ నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో నూతనగా నిర్మిస్తున్న రెండవ యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏ.బి.సి) సెంటర్ నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ నందు ఏ.బి.సి సెంటర్ నిర్మాణం పై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశం నందు తొలుత ప్రస్తుతం పొన్నూరు రోడ్డులో నిర్వహణలో ఉన్న ఏ.బి.సి సెంటర్ నందు రోజుకు ఎన్ని కుక్కలకు ఏ.బి.సి ఆపరేషన్ …

Read More »

వర్షాకాలంలో గ్రీనరి అభివృద్ధి, ముందస్తు చర్యల పై విభాగాధిపతులతో సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వర్షాకాలంలో గుంటూరు నగరంలో గ్రీనరి అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేయాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శనివారం నగర పాలక సంస్థలోని ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ నందు రానున్న వర్షాకాలంలో గ్రీనరి అభివృద్ధి మరియు తీసుకోవాల్సిన ముందస్తు చర్యల పై వివిధ విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రానున్న వర్షాకాలంలో గుంటూరు నగరంలో గ్రీనరీని అభివృద్ధి చేయడానికి పార్కులు మరియు సెంట్రల్ డివైడర్లలో మొక్కలను …

Read More »

గ్రీనరి అభివృద్ధి చేయుటకు ప్రణాళికలు సిద్దం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్ స్టేడియాన్ని అధునాతన ప్రమాణాలతో, ఆహ్లాదకరంగా ఉండేలా గ్రీనరి అభివృద్ధి చేయుటకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ తెలిపారు. శనివారం నగర పాలక సంస్థలోని కమిషనర్ ఛాంబర్ నందు ఎన్.టి.ఆర్ స్టేడియం పాలకవర్గం మరియు ఆకాష్ ఆర్కిటెక్ ప్రతినిధులతో, జియంసి అధికారులతో ఎన్.టి.ఆర్ స్టేడియం అభివృద్ధి పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశం నందు తొలుత స్టేడియంలో మహిళకు, పురుషులకు వేరుగా వేరుగా జిమ్ లను అభివృద్ధి చేయడానికి ఆకాష్ ఆర్కిటెక్ …

Read More »

“ఆపరేషన్ క్లీన్ స్వీప్” లో నగర ప్రజలు విస్తృతంగా భాగస్వాములు కావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మన నగరం – మన బాధ్యత అనే నినాదంతో “ఆపరేషన్ క్లీన్ స్వీప్” లో నగర ప్రజలు విస్తృతంగా భాగస్వాములు కావాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ‘స్వర్ణాంధ్ర – స్వచ్చాంద్ర’ సాధనలో భాగంగా “ఆపరేషన్ క్లీన్ స్వీప్” రెండో వారం కార్యాచరణ మేరకు ఈనెల 30 నుండి జూన్ 4 వ తేదీ వరకు నగరంలోని అన్ని వార్డ్ ల్లో డ్రైన్ల క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా స్థానిక …

Read More »

“ఆపరేషన్ క్లీన్ స్వీప్”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ‘స్వర్ణాంధ్ర – స్వచ్చాంద్ర’ సాధనలో భాగంగా గుంటూరు నగరాన్నిపరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు “ఆపరేషన్ క్లీన్ స్వీప్” పేరుతో నాలుగు వారాల ప్రత్యేక పారిశుధ్య కార్యాచరణలో భాగంగా ఈనెల 30 నుండి జూన్ 4 వ తేదీ వరకు నగరంలోని అన్ని వార్డ్ ల్లో పారిశుధ్య కార్యక్రమాలు జరుగుతాయని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో “ఆపరేషన్ క్లీన్ …

Read More »