Breaking News

Tag Archives: nuzividu

జగనన్న స్వచ్ఛ సంకల్పం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి జిల్లా పరిషత్ సీఈవో సూర్య ప్రకాశరావు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం జిల్లాలో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పరిషత్ సీఈవో సూర్య ప్రకాశరావు పిలుపునిచ్చారు స్థానిక సారధి ఇంజినీరింగ్ కళాశాలలో జగనన్న స్వచ్ఛసంకల్పం నూజివీడు నియోజకవర్గ స్ధాయి వర్క్ షాప్ కార్యక్రమంపై గ్రామ సర్పంచులు, అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశరావు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామాన్ని చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్ది ఆరోగ్యకర వాతావరణం కల్పించేందుకు సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇంటింటికి వెళ్లి చెత్త …

Read More »

చివరి క్షణం వరకు ప్రజల సంక్షేమాన్నే కాంక్షించిన మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : తన చివరి క్షణం వరకు ప్రజల సంక్షేమాన్నే కాంక్షించిన మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి అని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక చిన్న గాంధీ బొమ్మ సెంటర్ లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేద ప్రజలకు సంక్షేమ రాజ్యాన్ని చూపారన్నారు. ఉచిత విద్యుత్ తో రైతులకు ఆదుకున్నారని, ఆరోగ్యశ్రీ …

Read More »

భూ రికార్డుల డిజిటలైజేషన్ ద్వారా వివాదాలు లేని భూ రికార్డులు : సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె. సూర్యారావు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : భూమి రికార్డుల డిజిటలైజేషన్ ద్వారా భావితరాలకు వివాదాలులేని భూమి రికార్డులు అందుబాటులోకి ఉంటాయని సర్వే మరియు భూ రికార్డుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె. సూర్యారావు అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశం హాలులో భూమి రికార్డుల డిజిటలైజేషన్ పై వి.ఆర్.ఓ లు, సర్వేయర్ల, రెవిన్యూ సిబ్బందితో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా సూర్యారావు మాట్లాడుతూ ” వై.ఎస్.ఆర్. జగనన్న స్వచ్ఛ భూహక్కు మరియు భూ రక్షా పథకం …

Read More »

భద్రతా చర్యలు చేపట్టని పరిశ్రమలపై చర్యలు …. : ఆర్.డి.ఓ. కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్యాక్టరీల చట్టానికి అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టాలని పరిశ్రమల యజమానులపై చర్యలు తీసుకుంటామని రెవిన్యూ డివిజనల్ అధికారి కె రాజ్యలక్ష్మి హెచ్చరించారు పరిశ్రమల లో ప్రమాదాల నివారణకు ఏర్పాటయిన డివిజనల్ స్థాయి కమిటీ సమావేశం ఆర్ డి ఓ కె. రాజ్యలక్ష్మి అధ్యక్షతన శనివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు అధికారులు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తనిఖీలు నిర్వహించాలని, ఫ్యాక్టరీల చట్టానికి అనుగుణంగా నిర్దేశించిన …

Read More »

అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అండ… : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

నూజివీడు, ఆగష్టు, 25: అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచిందని శాసన సభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, నూజివీడు(మున్సిపాలిటీ) లలో అగ్రిగోల్డ్ బాధితులు 8205 మందికి నగదు జమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులు నూజివీడు మండలంలో 1339 మంది, మాజివీడు(మున్సిపాలిటీ) 1404 మంది, …

Read More »

అంగన్ వాడీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు…

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : డివిజనల్ లెవల్ అంగన్ వాడీ వర్కర్స్, అంగన్ వాడి హెల్పర్స్ సెలక్షన్ కమిటీ రెవిన్యూ డివిజనల్ అధికారి కె. రాజ్యలక్ష్మీ అధ్యక్షతన డివిజన్ లోని 5 అంగన్ వాడి ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ వర్కర్స్, అంగన్ వాడీ హెల్పర్స్ పోస్టులను బర్తీ చేసేందుకు స్థానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో ఆయా ప్రాజెక్టుల పరిధిలో ధరఖాస్తు చేసుకున్నవారికి శనివారం ఇంటర్వ్యూలను నిర్వహించారు. తిరువూరు ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 2 అంగన్ వాడీ వర్కర్స్ …

Read More »

ప్రతి గ్రామంలో సుపరిపాలన అందించడమే సియం. జగన్ ధ్యేయం : ఎమ్మేల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

నూజివీడు, ఆగష్టు, 20 : ప్రజా సంక్షేమ పాలనను పేద ప్రజల వద్దకు తీసుకువచ్చి సుపరిపాలన అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తపన అని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయ భవనాన్ని శాసనసభ్యులు లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా రాష్ట్రంలోని ప్రతీ పేదవాడికి సంక్షేమ పాలనను తీసుకు …

Read More »

గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములు అందించినవారు తమ భూముల డాక్యుమెంట్లు ధృవీకరించుకోవాలి : ఆర్డీవో కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములు అందించిన వారు తమ డాక్యుమెంట్లను సంబంధిత రెవెన్యూ అధికారులతో ధృవీకరించుకోవాలని ఆర్ డివో కె. రాజ్యలక్ష్మి విజ్ఞప్తి చేశారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములు అందించిన అల్లాపురం, బుద్ధవరం, దావాజీగూడెం గ్రామాలకు చెందిన వారిలో ఇంతవరకు 250 మంది మాత్రమే తమ భూములను సంబంధించిన డాక్యుమెంట్లను అధికార్ల వద్ద ధృవీకరించుకున్నారని, మిగిలిన వారు తమ దగ్గరలోని తాహశీల్దారు కార్యాలయంలో కానీ లేదా నూజివీడు సబ్ కలెక్టరు కార్యాలయంలో సంబంధిత అధికార్లకు తమ …

Read More »

పేదరికం ఉన్నత విద్యకు అడ్డు కాకూడదు… : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పేదరికం ఉన్నత విద్యాభ్యాసానికి అడ్డు కాకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా పాలసీకి శ్రీకారం చుట్టిందని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, విద్యార్దినులకు జగనన్న విద్యా కానుకగా పాఠ్య పుస్తకాలు, నోట్స్ పుస్తకాలు, 3 జతల యూనిఫారం, డిక్షనరీ, షూస్, బ్యాగ్ , తదితర విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా …

Read More »

విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్ గా తీర్చిదిద్దెందుకు విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం : విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్ గా తీర్చిదిద్దెందుకు విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర విద్య శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. స్థానిక ఎమ్మార్ ఏ ఆర్ పీజీ కేంద్రంలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అకాడమిక్ బ్లాక్ నిర్మాణపనులకు బుధవారం మంత్రి శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం లోని ప్రభుత్వ …

Read More »