Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

ఎఫ్‌సీఐ గోడౌన్‌లో ఈవీఎమ్‌ల భద్రతా ఏర్పాట్ల పరిశీలన

– డి ఆర్వో టి. సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు ఈవీఎంలు భద్రపరచిన గోడౌన్‌లను తనిఖీ చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక ఎఫ్‌సీఐ గోడౌన్ ఆవరణలో భద్రపరచిన ఈవీఎమ్ గోడౌన్‌ను నోడల్ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణ నాయక్ లతో కలిసి పరిశీలించారు. ఈ …

Read More »

బాలల సంరక్షణ – వ్యక్తిగత భద్రతపై అవగాహన కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమం భాగంగా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలల సంరక్షణ, వ్యక్తిగత భద్రతపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమం జిల్లా బీసీ వెల్ఫేర్ మరియు సాధికారత అధికారి బి. శశాంక గారి అధ్యక్షతన, రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వద్ద గల బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారి టి. శ్రీదేవి  మాట్లాడుతూ విద్యార్థులు …

Read More »

నిడదవోలు నియోజకవర్గం ప్రజానీకానికి విజ్ఞప్తి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మీ అందరి ఆదరాభిమానాలతో శాసనసభ్యుడిని అయ్యాను. జనసేన పార్టీ అధినేత మన ప్రియతమ డిప్యూటీ ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో రాష్ట్ర మంత్రిని అయ్యాను. దార్శనిక ముఖ్యమంత్ర  చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సభ్యుడినయ్యాను. ఈ 15 నెలల కాలం లో మీ సేవకుడిగా నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నాను. ముఖ్యం గా నా దగ్గరకి వచ్చిన వారు ఎవరైనా వారి సమస్యలను పరిష్కరించడానికి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ చెయ్యడం …

Read More »

మహిళా స్వయంసహాయ సంఘాల ఆర్థిక బలోపేతానికి సమిష్టి కృషి అవసరం

– గ్రౌండింగ్ పై ప్రత్యేక కార్యాచరణ – సమస్యలు డీఆర్‌డీఏ దృష్టికి తీసుకురావాలి – ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.వి.వి.ఎస్. మూర్తి బ్యాంకర్ల సహకారం అత్యవసరం – ఎల్‌డీఎమ్ డి.వి. ప్రసాద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని, బ్యాంకర్లు సహకరించాలని డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.వి.వి.ఎస్. మూర్తి కోరారు. తూర్పు గోదావరి జిల్లా డీఆర్‌డీఏ–సెర్ప్ ఆధ్వర్యంలో శుక్రవారం రాజమహేంద్రవరం రూరల్‌లోని సైన్స్ …

Read More »

2027 గోదావరి పుష్కరాల విజయవంత నిర్వహణకు సమగ్ర కార్యాచరణ అవసరం

– కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. శుక్రవారం బొమ్మూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళికలు, సన్నద్ధతపై సంబంధిత శాఖలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పోలీస్, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పుష్కరాలకు చేపడుతున్న ఏర్పాట్లను వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత …

Read More »

మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో అభివృద్ధి బాటలో నిడదవోలు

-16 నెలల కాలంలో నిడదవోలులో చేపట్టిన అభివృద్ధి పనులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు నియోజకవర్గ ప్రజలు మంత్రి కందుల దుర్గేష్ పై విశ్వాసముంచి ఎమ్మెల్యేగా గెలిపించడం, అనంతరం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రిగా వచ్చిన అవకాశంతో నిడదవోలు సమగ్రాభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ప్రజా సేవకుడిగా రూ.400 కోట్లతో సమగ్రాభివృధ్ధి దిశగా నిడదవోలు ప్రజలకు సేవకుడిగా పనిచేస్తున్న మంత్రి కందుల దుర్గేష్  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేవలం 16 నెలల కాలంలోనే రూ. 400 కోట్లతో నిడదవోలు నియోజకవర్గాన్ని …

Read More »

పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి

-కమిషనర్ రాహుల్ మీనా రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత మెరుగ్గా చేపట్టాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. శుక్రవారం తెల్లవారుజామున 8వ వార్డు ప్రకాష్ నగర్ పరిసర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక శానిటరీ ఇన్స్ పెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు, రిజిష్టర్లను పరిశీలించారు. ప్రతిరోజూ ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులు విధులకు వస్తున్నది ఆరా తీశారు. ఉదయం 7 గంటలకు కల్లా డోర్ టూ డోర్ చెత్త సేకరణ మొదలు కావాలని …

Read More »

ఆరోగ్యశ్రీ వైద్య సేవలు యథావిధిగా కొనసాగు తున్నాయి

– జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది – జిల్లా కో ఆర్డినేటర్ డా పి ప్రియాంక రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ పత్రికలలో వచ్చిన ప్రతికూల వార్తల నేపథ్యంలో, డాక్టర్ ఎన్.టి.ఆర్. వైద్య సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలందించే క్రమంలో జిల్లా యంత్రాంగం అన్ని అవసరమైన చర్యలు చేపట్టిందని జిల్లా కోఆర్డినేటర్ పి. ప్రియాంక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య సిబ్బంది అసోసియేషన్ పిలుపు మేరకు వైద్య సేవల నిలుపుదల సమ్మె కొనసాగుతున్నప్పటికీ, రాష్ట్ర …

Read More »

కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు మరియు సిబ్బందిని పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగిందని తూర్పు పా౦త విద్యుత్ పంపిణీ సంస్థ తూర్పు గోదావరి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె. తిలక్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం సర్కిల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయబడినట్లు ఆయన తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా తక్షణ చర్యలు తీసుకునేందుకు …

Read More »

పారిశ్రామిక వాడల్లో మొక్కలు నాటే కార్యక్రమం… : పర్యావరణ పరిరక్షణపై కలెక్టర్ పిలుపు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో నవంబర్ 14 మరియు 15 తేదీలలో జరగబోయే భాగస్వామ్య పారిశ్రామిక సదస్సు నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక వాడల్లో స్వచ్ఛత, పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం సాయంత్రం ధవళేశ్వరం ఇండస్ట్రియల్ ఏరియాలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, అక్టోబర్ 15 నుంచి నాలుగు వారాలపాటు పారిశ్రామిక వాడల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని …

Read More »