Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు చేపట్టే సాధారణ తనిఖీల్లో భాగంగా శనివారం ఉదయం ఈవీఎమ్ గోడౌన్ ను పరిశీలించినట్లు తెలిపారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు చేపట్టే సాధారణ తనిఖీల్లో భాగంగా శనివారం ఉదయం ఈవీఎమ్ గోడౌన్ ను పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా, స్థానిక F.C.I గోడౌన్ లో భద్రపరచిన ఈవీఎమ్ గోడౌన్ ను కలెక్టర్, రాజమండ్రి ఆర్డీఓ ఆర్. కృష్ణ నాయక్, మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించడం జరిగింది. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ప్రకారం …

Read More »

గోదావరి వరద ముప్పు ఫీల్డ్ విజిట్, ప్రజలకు అప్రమత్తం సూచనలు కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, , నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అధిక వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో, పై ప్రాంతాల నుంచి గోదావరి నదిలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈరోజు సాయంత్రం గాని ఉదయం గాని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని కూడా వారు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్  కీర్తి చేకూరి శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆమె సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్, …

Read More »

జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాల పై ప్రజలకు అవగాహన కల్పించండి

-జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాల పై ప్రజలకు అవగాహన కల్పించండి -ప్రజలకు జరిగే మేలును సులభంగా అర్థమయ్యేలా వివరించాలి -నెల రోజులపాటు సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్ పేరిట ప్రచార కార్యక్రమాలు -వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు దిశా నిర్దేశం చేసిన జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జీఎస్టీ సంస్కరణల మూలంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేకూరే మేలును వివరించే విధంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ , జిల్లా జీ ఎస్ టి నోడల్ అధికారి …

Read More »

డీఎస్సీ అభ్యర్థుల విజయవాడ ప్రయాణ ఏర్పాట్లు పూర్తి  జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డీఎస్సీ–2025లో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థుల విజయవాడ ప్రయాణ ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. విజయవాడ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమం లో పాల్గొనే అభ్యర్థుల కోసం నగరంలో ఆరు స్కూల్ లో ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగిందనీ తెలిపారు. కార్యక్రమానికి హాజరుకావడానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులు ఒక సహాయకుడు/సహాయకురాలతో కలసి 24.09.2025 సాయంత్రం 4.00 గంటలకు రాజమహేంద్రవరం నందు …

Read More »

న్యాయపరమైన అంశాలపై ప్రజలకు అవగాహన

రాజంద్రంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : బాల్యవివాహాల నివారణ, మాదకద్రవ్యాల ప్రభావం, న్యాయపరమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పంచాయితీ కార్యాలయం, ధవళేశ్వరం నందు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి మాట్లాడుతూ, బాల్య వివాహాలు సమాజానికి కలిగే హానులు, చట్టపరమైన …

Read More »

జాతీయ స‌మైక్య‌త‌ను చాటిచెప్పేలా హ‌ర్ ఘ‌ర్ తిరంగా

-ప్రతి ఇంటిపైనా జాతీయ పతాకం ఎగురవేయాలి -జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి -హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా మెగా ర్యాలీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స‌మైక్య‌త‌ను చాటిచెప్పేలా హ‌ర్ ఘ‌ర్ తిరంగా కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి తెలిపారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా సోమవారం వై జంక్షన్ నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ఆర్ఎంసి అధికారులు, ఉద్యోగులు, సచివాలయ కార్యదర్శులతో మెగా ర్యాలీ నిర్వహించారు. తొలుత ప్రచార పోస్టర్ ను …

Read More »

“హర్ ఘర్ తిరంగా” కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో నిర్వహించాలి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, తహసీల్దార్లు, జిల్లా అధికారులు పాల్గొన్న దృశ్యమాధ్యమ సమావేశంలో కీలక సూచనలు చేశారు. కలెక్టర్ పి. ప్రశాంతి పిలుపునిచ్చి, “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా లోని అన్ని మండలాల్లో తప్పక నిర్వహించాలని తహసీల్దారులను ఆదేశించారు. చిన్నపిల్లలు, సైనికులు, వృద్ధులు, ప్రజా ప్రతినిధులు సహా అందరిని ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలని తెలిపారు. అమృత్ సరోవర్ ప్రాజెక్టులు, నెహ్రూ యువ కేంద్రాలు, మోడల్ గ్రామ పంచాయతీలు, …

Read More »

ప్రతి బిడ్డకు కుటుంబం – ఫోస్టర్ కేర్ ద్వారా సాకారం పి. ప్రశాంతి

-జాయింట్ కలెక్టర్ తో కలిసి గోడ ప్రతులను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ -www.cara.wcd.gov.in వెబ్ సైట్ లో సమగ్ర సమాచారం అందుబాటులో – కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “ప్రతి పిల్లవాడికి ఒక ప్రేమతో కూడిన కుటుంబంలో పెరగాల్సిన హక్కు ఉందన్నారు, అయితే, కొన్ని కారణాల వల్ల పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణ లేకుండా ఉంటారని, అలాంటి చిన్నారులకు తాత్కాలికంగా ఒక కుటుంబ వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం ఫోస్టర్ కేర్ కార్యక్రమాన్ని ప్రారంభించిందనీ జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. …

Read More »

సమస్యల పరిష్కారంలో అర్జీదారుల సంతృప్తి ముఖ్యం

-డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకట రమణ -పీజీఆర్ఎస్ ద్వారా 30 అర్జీలు స్వీకరణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పీజీఆర్ఎస్ లో అందిన ప్రతి అర్జీపై క్రియాత్మకంగా స్పందించి.. ప్రభుత్వ పనితీరు పట్ల అర్జీదారులలో నమ్మకాన్ని పెంపొందించాలని డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకట రమణ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించగా.. మొత్తం 30 అర్జీలు వచ్చాయి. వీటిలో ఇంజనీరింగ్ కి సంబంధించి 20, రెవెన్యూకి సంబంధించి 3, టౌన్ ప్లానింగ్ కి సంబంధించి 5, …

Read More »

పీజీఆర్‌ఎస్ – మీ కోసం”లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి

– డివిజనల్ పరిపాలన అధికారిణి యం. సుజాత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు 1100 కాల్ సెంటర్ నంబర్‌కు ఫిర్యాదులు తెలపవచ్చు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీపై సమయానుకూలంగా చర్యలు తీసుకొని, దరఖాస్తుదారులకు న్యాయం చేయాలని డివిజనల్ పరిపాలన అధికారిణి యం. సుజాత అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన “పీజీఆర్‌ఎస్ – మీ కోసం” కార్యక్రమంలో, ఆర్డీఓ తరపున డివిజన్ స్థాయి అధికారులతో కలిసి ఆమె 7 అర్జీలను స్వీకరించారు. నిర్దేశిత గడువులో …

Read More »