Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

వికాస ఆధ్వర్యంలో అక్టోబర్ 25న జాబ్ మేళా కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “వికాస” ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ శనివారం ఉదయం 9.30 గంటలకు రాజమహేంద్రవరం కలెక్టరేట్ పరిసరాల్లోని వికాస కార్యాలయం (బొమ్మూరు హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా)లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ జాబ్ మేళాలో ఎస్‌ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ …

Read More »

తెలుగు విశ్వ విద్యాలయం ఉప కులపతిగా ఆచార్య మునిరత్నం నాయుడు బాధ్యతలు స్వీకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాషా పరిరక్షణకు అంకితభావంతో కృషి – స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధనకు పునరంకిత మవుతున్నానని ఉప కులపతి డి. మునిరత్నం నాయుడు పేర్కొన్నారు. గురువారం ఉదయం రాజమహేంద్రవరం స్థానిక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా ఆచార్య డి. మునిరత్నం నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది, సాహిత్యవేత్తలు పాల్గొన్నారు. ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆచార్య డి. …

Read More »

నకిలీ మద్యం పట్టుబడుతుంది – “సురక్షా” యాప్ ద్వారా QR స్కాన్ చేయండి  సీహెచ్ లావణ్య

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత కాలంలో నకిలీ, కల్తీ మద్యపాన పదార్థాలు విస్తృతంగా లభ్యమవుతున్న నేపథ్యంలో, అబ్కారీ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “సురక్షా – ఏపీ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ” అనే మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా ప్రజలు తాము కొనుగోలు చేసిన మద్యం సీసాపై ఉన్న QR కోడ్ను స్కాన్ చేసి, ఆ మద్యం ప్రభుత్వ అనుమతితో విక్రయించబడినదా లేదా అనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చని జిల్లా మద్యనిషేధ మరియు అబ్కారీ అధికారి సీ.హెచ్. లావణ్య గురువారం …

Read More »

జిల్లా యంత్రాంగం తరపున చేపట్టిన చర్యల్లో భాగంగా, కార్తీక మాసం పుణ్య స్నానాలు ప్రారంభం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా యంత్రాంగం తరపున చేపట్టిన చర్యల్లో భాగంగా, కార్తీక మాసం పుణ్య స్నానాలు ప్రారంభం కానున్న దృష్ట్యా రాజమండ్రి డివిజన్ పరిధిలోని అన్ని ఘాట్లలో భక్తుల సౌకర్యాలు, సురక్షతలను పరిశీలించడానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు సమన్వయ శాఖల అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించండం జరిగిందనీ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ తెలియ చేశారు. గురువారం నగరంలోని, రూరల్ పరిధిలోనీ పలు ఘాట్ల ను ఆర్డీవో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా …

Read More »

అక్టోబర్ 18న మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్ మేళా

– జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్‌ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో అక్టోబర్ 18వ తేదీ (శనివారం) ఉదయం 10 గంటలకు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్రప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఎమ్‌.సి.వి. మోటార్ కార్పొరేషన్‌, టీమ్‌ లీజ్‌, ఆప్యాక్‌ ఫైనాన్షియల్‌ …

Read More »

దీపావళి సందర్భంగా అర్బన్‌ లో 141, రూరల్‌ లో 116 తాత్కాలిక లైసెన్స్‌లు జారీ ఆర్‌డీవో ఆర్‌. కృష్ణ నాయక్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి పండుగను పురస్కరించుకుని రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 141, రూరల్‌ పరిధిలో 116 దీపావళి షాపుల ఏర్పాటుకు తాత్కాలిక లైసెన్స్‌లు జారీ చేయడం జరిగిందని రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఆర్‌. కృష్ణ నాయక్ గురువారం తెలిపారు. ఆర్ట్స్‌ కళాశాల, సుబ్రమణ్య మైదానం, క్వారీ మార్కెట్‌, వి.ఎల్‌.పురం జంక్షన్‌ పరిధిలో షాపులు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. అలాగే 9 రూరల్ మండలాల్లో ఇప్పటి వరకు 116 లైసెన్స్‌లు జారీ చేశామని వివరించారు. ఆర్‌డీవో …

Read More »

సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఉదయం స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి లాలా చెరువు వరకు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై నిర్వహించిన అవగాహన ర్యాలినీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏ ప్రభుత్వం అయిన పన్నులను పెంచడం తెలుసు గానీ, తగ్గించడం ఎక్కడ చూడలేదు. . పన్నులు తగ్గించాలని ధర్నాలు ఉద్యమాలు చేస్తే ఒకటి లేదా రెండు శాతం తగ్గించే సందర్భాలు మనం …

Read More »

జిల్లాలో హోమ్‌స్టే విధానానికి శ్రీకారం – ఉపాధి, పర్యాటకానికి కొత్త దిశ

-జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి -కిరణ్య హోం స్టేతో ముందుకొచ్చిన వీరలంకపల్లి వాసి చింతా కిరణ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటకులకు స్థానిక జీవనశైలిని దగ్గరగా అనుభవించే అవకాశం కల్పించడం, గ్రామీణ పర్యాటకానికి ఊతమివ్వడం హోమ్ స్టే ల ఏర్పాటు ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానాన్ని, పర్యాటక హోమ్‌స్టే పోర్టల్‌ను ఆవిష్కరించి, వర్చువల్గా మాట్లాడారు. …

Read More »

తూర్పు గోదావరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు బొమ్మూరు కార్యాలయంలో “సూపర్ GST – సూపర్ సేవింగ్స్” ప్రత్యేక ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు బొమ్మూరు కార్యాలయంలో “సూపర్ GST – సూపర్ సేవింగ్స్” ప్రత్యేక ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రచారం 25-09-2025 నుండి 19-10-2025 వరకు కొనసాగనుంది అని DMHO డాక్టర్ K. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం ప్రజలకు, వినియోగదారులకు మరియు వ్యాపార వర్గాలకు GST సంస్కరణల ప్రయోజనాలను అవగాహన చేయించడం. ముఖ్యంగా మందులు, వైద్య పరికరాలు మరియు ఆరోగ్య బీమా …

Read More »

తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో “వికాస” ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ జాబ్ మేళా లో ఎంపిక అయిన విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం అందచేశారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో “వికాస” ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ జాబ్ మేళా లో ఎంపిక అయిన విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం అందచేశారు. కలెక్టర్ విద్యార్థులను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ జాబ్ మేళాలో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు, అందులో 107 మంది ఎంపికయ్యారని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కే. లచ్చారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు …

Read More »