Breaking News

గుంతల రహిత రహదారులతో పాటు పరిశుభ్రమైన నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుంతల రహిత రహదారులతో పాటు పరిశుభ్రమైన నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం కమిషనర్ తన పర్యటనలో భాగంగా నేతాజీ బ్రిడ్జి, కృష్ణలంక, బందర్ రోడ్డు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. రహదారుల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, రహదారుల పరిస్థితి, మొక్కల సంరక్షణ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎక్కడా గుంతలు ఉండకూడదని, గుంతల రహిత రహదారులే లక్ష్యంగా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ స్పష్టం చేశారు. రహదారిపై గుంతలు లేదా ఇతర సమస్యలు గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. నగరంలోని ప్రధాన రహదారులు, సర్వీస్ రోడ్లు, వంతెనల పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రహదారుల వెంట పేరుకుపోయిన చెట్ల కొమ్మలు, ఆకులు, ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. వ్యర్థాలు పేరుకుపోకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ, సమస్యను గుర్తించిన వెంటనే పరిష్కరించాలని సూచించారు.

నేతాజీ బ్రిడ్జి హైవే ప్రాంతాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని కమిషనర్ సూచించారు. మొక్కలను కేవలం నాటడమే కాకుండా వాటి పెరుగుదల, సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ట్రాఫిక్‌కు, పాదచారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మొక్కలను ఆకర్షణీయమైన డిజైన్‌తో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కృష్ణలంక సర్వీస్ రోడ్ ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణను పరిశీలించిన కమిషనర్, రహదారులపై ఎక్కడా చెత్త, వ్యర్థాలు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాల కారణంగా నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి వెంటనే సమస్యను పరిష్కరించాలని, దోమల ఉత్పత్తికి అవకాశం లేకుండా పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం కృష్ణలంకలోని ఏపీఎస్‌ఆర్‌ఎం పాఠశాల సమీపంలోని అన్న క్యాంటీన్‌ను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్యాంటీన్‌కు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, వ్యర్థాల తొలగింపు తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *