Breaking News

దేశ రాజకీయాల్లో మార్పు రావాలి.. బీజేపీని గద్దె దించాలి!

-ఎన్నికల విధానంలో, ప్రజాస్వామ్య విధానాల అమలులో మార్పు రావాలి!!
-నగర సమగ్రాభివృధికి 50 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి!!!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ రాజకీయాల్లో మార్పు రావాలి.. బీజేపీని గద్దె దించాలి అని సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు బద్లావ్ జరూరీ హై`మార్పు కావాలి’ పేరుతో గురువారం నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రచార పాదయాత్ర ఈ రోజు సిపిఐ స్థానిక డివిజన్ కార్యదర్శి మోకా దుర్గారావు అధ్యక్షతన సాయంత్రం పశ్చిమ నియోజక వర్గం స్థానిక జోడు బొమ్మల సెంటర్ నుండి పంజా సెంటర్ వరకు సాగింది. ఈ పాదయాత్రను సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో మార్పు రావాలి.. ప్రజాస్వామిక విధానాలు అమలు చేయడంలో మార్పు రావాలని అన్నారు. ‘నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో మార్పు రావాలి. మతోన్మాదాన్ని వ్యతిరేకించడంలో మార్పు రావాలి. రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలో మార్పు రావాలి. ఎన్నికల విధానంలో మార్పు రావాలి. ధరల పెరుగుదలను అరికట్టడంలో మార్పు రావాలి. ధరల పెరుగుదలను అరికట్టడంలో మార్పు రావాలి. ఆర్థిక విధానాల అమలులో మార్పు రావాలి. కష్టించి పని చేసే శ్రమ జీవుల జీవితాల్లో మార్పు రావాలి. ఇవన్నీ జరగాలంటే 12 ఏళ్లుగా ఢిల్లీ గద్దెపై కూర్చుని నియంతృత్వ విధానాలను అమలు చేస్తున్న బీజేపీని అధికారం నుంచి మార్చివేయాలి’ అని చెప్పారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీ ప్రచార పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మోదీ ప్రభుత్వ నిరంకుశ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించాలని పిలుపునిచ్చారు. దేశంలో సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థ విజృంభించి ప్రజలను దోచుకుంటోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని, ప్రశ్నించే ప్రతి గొంతుకను జైళ్లలో నిర్బింధిస్తున్నారని మండిపడ్డారు. కులాలు, మతాలు, జాతుల మధ్య తగువులు పెట్టి దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యా వ్యవస్థలో అనేక లోపాలు జరుగుతున్నాయని, పేపర్ లీకేజీలు పెరిగిపోయాయని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ చేతులెత్తారని, ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధ్వంసకర విధానాల వల్ల 5లక్షల చిన్న, పెద్ద పరిశ్రమలు మూతపడ్డాయని లక్షాది మంది రోడ్డుపాలయ్యారని ఆందోళన వ్యక్తంచేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారని చెప్పారు. తాము పండించిన పంటలకు కనీస ధరలు లభించక సగటున రోజుకు 31 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేంద్రానికి భజన చేయడంల మునిగిపోయిందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తూ ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అంటూ ప్రజలను భ్రమింపజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాలను అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందువల్ల ఈ ప్రభుత్వ, పరిపాలన విధానాల్లో మార్పు రావాలని ప్రజల్లోకి వెళుతున్నామని వివరించారు. ప్రజలు కూడా ఆలోచించి భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే పాదయాత్రల్లో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయడం ద్వారా పాలకులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు దోహదపడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ నగర అభివృద్ధి జరిగింది అంటే అంది కేవలం కమ్యూనిస్టుల పాలనా కాలంలోనే అని అన్నారు. కొండా ప్రాంతాలలో ఇళ్ల పట్టాలు వచ్చినవి అన్నా, నాఫేరా ప్రజలకు మౌలిక వసతుల కల్పనవంటి అనేక అంశాలపై కమ్యూనిస్టులు ఆనాడు దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చేసిన అభివృద్ధి తప్ప మరొకరి పాత్ర ఏమి లేదని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ నుండి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా పని చేసిన తమ్మిన పోతరాజు గాని, ఉప్పలపాటి రామచంద్రరాజు గాని, కె.సుబ్బరాజు గాని, షేక్ నాసర్ వలి గాని చేసిన కృషి ఫలితంగా ఈ నాడు కొండప్రతాలలో నివాసితున్న ప్రజలకు ఇళ్లపట్టాలుగాని, రోడ్లు, మెట్లు,మంచి నీటి వసతి, డ్రైనేజి వ్యవస్థ వంటి అనేక మౌలిక వసతులకు కృషి చేసారు ముఖ్యంగా ఈ ప్రాంతం అభివృద్ధిలో కమ్యూనిస్టులు చేసిన కృషి ఎంతో ఉన్నది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ నేడు ఉన్న ప్రజా ప్రతినిధులు ఎన్నికల సమయంలో తప్ప ఇంకా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నాడని పరిస్థితి చూస్తున్నామని. ఇటువంటి పరిస్థితిలో రానున్న నగర పాలక సంస్థల ఎన్నికలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటు పడే కమ్యూనిస్టులను ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
గత కొన్నేళ్లుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైన విజయవాడ నగర సమగ్ర అభివృద్ధి కోసం వెంటనే రూ.50వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలో అవసరమైన ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు నిర్మించాలని, కూటమి ఎన్నికల హామీ మేరకు విద్యాధరపురం లేబర్ కాలనీలో స్టేడియం నిర్మించాలన్నారు. నగరంలోని కొండ ప్రాంతాల ప్రజల ఇళ్లకు నామమాత్రపు ధరకే రిజిస్ట్రేషన్ చేయాలని, ఇతర అన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో అక్రంగా మాదక ద్రవ్యాల వినియోగం వలన యువజ పెడదోవ పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ వారు పటిష్టమైన చర్యలు చేపట్టి శాంతి భద్రతలను అందులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ పాదయాత్ర స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరింత భారీ ఉద్యమాన్ని చేపడతామని చెప్పారు.

నగర కార్యదర్శివర్గ సభ్యులు బుట్టి రాయప్ప , మూలి సాంబశివరావు, కొట్టు రమణారావు, సంగుల పేరయ్య, నగర కార్యవర్గ సభ్యులు డి.వి.రమణబాబు, తూనం వీరయ్య, దుగ్గిరాల సీతారావమ్మ, ఏఐటీయూసీ నాయకులు కె.ఆర్ ఆంజనేయులు,మారుతీ మహిళా సమాఖ్య నాయకురాళ్లు బంకా ఝాన్సీ, నీలం భాగ్య లక్ష్మి , దుర్గాసి రావణమ్మ, చింతాడ పార్వతి , డి.పుష్ప, షైనీ, ఏఐవైఎఫ్ నాయకులు కంచర్ల భార్గవ్, సింగంశెట్టి మోహనప్రసాద్,వెంకీ, శీరం రవి, ప్రజా నాట్యమండలి నాయకులు ఆర్.పిచ్చయ్య, నగర నాయకులు సయ్యద్ అప్సర్, బోరా రామకృష్ణ, పగిడికత్తుల రాము, మురుగేషన్ రాము, రాయన గుర్నాధం, కరోతి వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *