Breaking News

అగ్రిగోల్డ్ యజమాన్యపు కుట్రలు అడ్డుకోవాలి

-బినామీ ఆస్తులు వెలికితీయాలి
-మొత్తం ఆస్తులను స్వాధీన పరుచుకోవాలి
-ప్రతి లబ్దిదారురి బాండ్లు, ఆస్తులను ప్రభుత్వం సేకరించాలి
-సీఐడీ బృందం అప్రమత్తంతో ఆస్తులు వెలికితీయాలి
-బాధితుల సమస్యలపై స్పందించిన సీఎంకు ధన్యవాదాలు
-అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్లు ఆరు మాసాల్లో చెల్లించాలని సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని నేడు సమావేశమైన పలు రాష్ట్రాల బాధితుల అసోసియేషన్లు స్వాగతం పలికాయని అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు తెలిపారు. విజయవాడ దాసరి భవన్‌లో మంగళవారం ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, అండమాన్ తదితర రాష్ట్రాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం ఏపీ అధ్యక్షులు ఈవీ నాయుడు అధ్యకాతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా ముప్పాళ్ళతోపాటు మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 200 మంది హాజరయ్యారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఎన్నో రకాల స్కీమ్‌లతో ఆయా రాష్ట్రాలలో వసూలు చేసిన డిపాజిట్లు, అమ్మిన ఇళ్ల స్థలాలు, కౌలు భూములు విక్రయాల స్కీమ్‌లు చేశారని, అందులో ఎక్కువ మంది సామాన్యులు, మధ్యతరగతి, చిరు ఉద్యోగులు అని, వారికి న్యాయం జరిగేలా చూడాలని వారి బాధలను ఆవేదనతో వ్యక్తం చేశారు. అనంతరం సమావేశం వివరాలను మీడియా ప్రతినిధులకు అసోసియేషన్ నేతలు వివరించారు. ముప్పాళ్ళ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును వెంటనే ఆచరణలోకి తీసుకు రావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎనిమిది రాష్ట్రాలలో బాధితుల బాండ్లను, కంపెనీ నుంచి కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూముల వివరాలను ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఎనిమిది రాష్ట్రాల్లోను తగిన కాలపరిమితిని విధించి ప్రత్యేక కేంద్రాలను తెరచి సేకరించాలని కోరారు. కంపెనీ యాజమాన్యం దాచని బినామీ ఆస్తులను వారి కుటుంబ సభ్యులు, బంధువుల పేర్ల ఉంచిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని అన్నారు. సీఎం చంద్రబాబు ఆరు మాసాల్లో బాధితులకు పూర్తి న్యాయం జరపాలని చెప్పిన ఆదేశాలను ఆచరణలో పెట్టేలా మంత్రివర్గ ఉప సంఘం బాధ్యతగా కృషి చేయాల్సి ఉంటుందన్నారు.
మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ మంత్రివర్గ ఉప సంఘం రెండు సార్లు సమావేశాలు జరపడం, ఆస్తుల స్వాధీనానికి, వాటి విలువ మదింపునకు సాధ్యమైన ఆస్తుల అమ్మకాలకు కావాల్సిన విధి విధానాలు రూపొందించడానికి వేగంగా కృషి చేయాలని కోరారు.
అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కంపెనీ పలు రకాల బినామీ కంపెనీలు పెట్టి ఆస్తులను రకరకాలుగా దాచిందన్నారు. పవర్ ప్లాంట్లు, కొన్ని కంపెనీల మిషనరీ, విడి భాగాలను అక్రమంగా తరలించి అమ్ముకుందని, వాటిని కూడా వెలికి తీయాలన్నారు.
రాష్ట్ర అధ్యక్షులు ఈవీ నాయుడు మాట్లాడుతూ అండమాన్ బ్రాంచిలో బాధితులకు బాండ్లు సక్రమంగా ఇవ్వలేదని, అండమాన్ అధికారులను పిలిపి వివరాలు రాబట్టాలన్నారు. తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్‌లో అక్రమంగా విక్రయించిన ఆస్తులను వెలికి తీయాలని, బ్యాంకులతో యాజమాన్యం లాలూచీ కొన్ని ముఖ్య ఆస్తులను విక్రయించిన తీరు మోసూరితమన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో ఏపీ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖర్‌రావు, కర్ణాటక రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు గురుమూర్తి, తెలంగాణ ప్రధాన కార్యదర్శి జి.వెంకటేశ్వరరావు, టి.రజిత, అండమాన్‌కు చెందిన మధు, ఒరిస్సాకు చెందిన చంద్రరావు, లక్ష్మణరావు, ఏపీకి చెందిన ఆరేళ్లమ్మ, జయసుధ, మల్లికార్జున్, శిద్దేశ్వర్, బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *