విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీఎస్‌ఆర్టీసీలో పనిచేస్తున్న ముస్లిం మైనారిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తామని బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు, ఏపీఎస్‌ఆర్టీసీ మైనారిటీ విభాగం గౌరవ అధ్యక్షుడు సయ్యద్ భాషా తెలిపారు. విజయవాడ బుధవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో మైనారిటీ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. మైనారిటీ ఉద్యోగులకు సెలవులు ప్రయాణ అనుమతులు రంజాన్ సమయంలో విధుల విషయంలో వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదాలు ఇతర సమస్యలను మతపరమైన కోణంలో కాకుండా అందరినీ సమానంగా చూస్తూ పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. మైనారిటీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాషా, మాట్లాడుతూ ఆర్టీసీ మైనారిటీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటు రిటైర్మెంట్ అనంతరం రావాల్సిన ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ అభివృద్ధితో ఉద్యోగ అవకాశాలు పెరగాలని ఆకాంక్షించారు. మైనారిటీ ఉద్యోగుల సంక్షేమానికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News