విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆటోనగర్ సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ మహమ్మద్ ఇర్ఫాన్ నాయకత్వంలో నూతన ప్యానెల్‌ను ఏర్పాటు చేసినట్లు ఆటోమొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ (ఏటిఏ) అధ్యక్షుడు రాజరాల వెంకటరమణారావు (బాబ్జి) ప్రకటించారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్యానెల్ అభ్యర్థులను పరిచయం చేస్తూ గత పాలకవర్గ వైఫల్యాలపై ధ్వజమెత్తారు.
అభివృద్ధి శూన్యం అవినీతి మయం
2014 నుంచి రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న పాలకవర్గం తమ మేనిఫెస్టోలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయలేదని రమణారావు విమర్శించారు. ఆటోనగర్‌లో డ్రైనేజీ శానిటైజేషన్ మంచినీటి సమస్యలు తాండవిస్తున్నాయనికేవలం ఫోటోలకు పరిమితమవ్వడమే తప్ప క్షేత్రస్థాయిలో పనులు జరగలేదని ఆరోపించారు. బిల్లలు మాత్రం అయిపోతున్నాయి కానీ, కొత్తగా ఒక్క డ్రైన్ కూడా నిర్మించలేదు అని ఆయన మండిపడ్డారు. చారిత్రక పోరాటం జీవో నంబర్ 5పై విజయం. గతంలో ఆటోనగర్ ప్లాట్ యజమానులకు భారంగా మారిన ‘జీవో నంబర్ 5’ (రెండోసారి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు) పై తాము న్యాయపోరాటం చేసి స్టే తీసుకువచ్చామని, తద్వారా వేలాది మంది కార్మికులు, యజమానుల ప్రయోజనాలను కాపాడామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్యానెల్ అభ్యర్థులు వీరే నూతన ప్యానెల్ తరపున చైర్మన్ అభ్యర్థిగా మహమ్మద్ ఇర్ఫాన్, వైస్ చైర్మన్‌గా ఘoటా సాయివర ప్రసాద్, సెక్రటరీగా రాజనాల వెంకట రమణారావు బాబ్జి, జాయింట్ సెక్రటరీగా షేక్ మునీర్ అహ్మద్, ట్రెజరర్‌గా పయ్యాల మాలద్రిలతో పాటు 13 మంది వార్డు మెంబర్లు పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.
బహిరంగ చర్చకు సవాల్
గత పాలకవర్గం తాము చేసిన ఒక్క అభివృద్ధి పనినైనా నిరూపిస్తే, తాము తక్షణమే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని రమణారావు బాబ్జి, సవాల్ విసిరారు. మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమైన వాగ్దానాలు
డ్రైనేజీ, శానిటైజేషన్ వ్యవస్థల ఆధునీకరణ, డంపింగ్ యార్డ్, ఎస్టీపీ ప్లాంట్ల తొలగింపు, నూతన విద్యుత్ లైన్లు, స్టామ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, గుంట్రిప్ప డ్రైన్ సమస్య పరిష్కారం. ఆటోనగర్ భవిష్యత్తు కోసం ఓటర్లు తమ ప్యానెల్‌ను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రెండో వార్డ్ నెంబర్ షేక్ జిలాని, సయ్యద్ షా సాహెబ్ హుస్సేన్, బాబా 13 మంది వార్డు నెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News