Breaking News

ట్రాఫిక్ నిబంధనలపై నే ప్రాణ రక్షణ… : కొల్ల జయశ్రీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంచడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని జైహో వాకర్స్ క్లబ్ విజయవాడ అధ్యక్షురాలు న్యాయవాది కొల్ల జయశ్రీ, పేర్కొన్నారు. 2017లో ప్రారంభమైన ఈ క్లబ్ అప్పటి నుంచి విజయవాడ నగరంలో వినూత్న సేవా కార్యక్రమాలతో దూసుకుపోతోంది. నిరంతర సేవా పథంలో క్లబ్ సెక్రటరీ రమాదేవి ట్రెజరర్ ఆంజనేయరాజు లైబ్రేరియన్ రమాదేవి సమన్వయంతో క్లబ్ పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బందర్ రోడ్డు ఠాగూర్ లైబ్రరీలో జైహో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలకు దేశభక్తి గీతాల పోటీలు నిర్వహిస్తున్నట్లు జయశ్రీ తెలిపారు. వీటితో పాటు వృద్ధాశ్రమాలకు సహాయం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన వస్తువుల పంపిణీ చలికాలంలో దుప్పట్లు వర్షాకాలంలో గొడుగులు మరియు పండుగ సమయాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. ట్రాఫిక్ అవేర్నెస్‌పై ప్రత్యేక దృష్టి క్లబ్ ప్రధానంగా ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తోంది. పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థులకు ట్రాఫిక్ పోలీసుల సహకారంతో నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రోడ్లపై ఉన్న స్పీడ్ బ్రేకర్లు సరిగ్గా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన క్లబ్ సభ్యులు స్వచ్ఛందంగా వాటికి వైట్ పెయింట్ వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా కష్టకాలంలోనూ విరామం లేకుండా మాస్కుల పంపిణీతో పాటు రోడ్లపై ప్రమాదకరంగా ఉన్న గుంతలను ఆక్రమణలను గుర్తించి మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళుతున్నారు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి… ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదం జరగని రోజంటూ లేదు. వాహన దారులు వేగం తగ్గించి క్షేమంగా ఇంటికి చేరుకోవడమే అసలైన లాభం అని జయశ్రీ అభిప్రాయపడ్డారు. కేవలం ప్రభుత్వంపైనే భారం వేయకుండా రాంగ్ రూట్ లో వెళ్లడం వంటి తప్పులు చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఆమె కోరారు.  ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన గ్రంథాలయ చైర్మన్ ఎంఎస్ బేగ్, మరియు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *