-జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాల
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు” కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని ఆగస్టు 14వ తేదీ శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. వత్సవాయి వాసవి కళ్యాణ మండపంలో ఉదయం 10.00 గంటల నుంచి ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజల నుంచి అధికారులు అర్జీలను స్వీకరించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నారని కలెక్టర్ తెలిపారు. జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలు ఈ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ కోరారు.
Prajavartha Online Telugu News