Breaking News

కనీసం ప్రజాస్వామ్యం కరువు

-మూడవసారి పాలన ముదునుష్ఠమే
-మోడీ పాలనపై మండిపడ్డా మాజీ మంత్రి వడ్డే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో కనీసం ప్రజాస్వామ్యం కరువైందని, మోడీ మూడవసారి అధికారం ముదునుష్ఠ పాలనేనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మండిపడ్డారు. నగరంలోని గాంధీనగర్ ప్రసెక్లబ్ లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. 80 వ స్వాతంత్ర దినోత్సవం వచ్చిన, ఎన్ని పంచవర్ష ప్రణాళికలు జరిగిన పేదవాడి, రైతు బతుకు మారకపోగా అథోగతి పాలైందని బిజెపి నాయకత్వంలోని కేంద్ర ఎన్ డిఏ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఏందరో యువకులు ప్రాణాలు ఆర్పించి, స్వతంత్రం సాధించిన ఫలితం శూన్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి నుగునుగు మిసాల వయస్సు, రక్తం వృధాగా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగంలో నాలుగు లేబర్ కొడ్స్ చట్టం చేసి, కార్పొరేట్ల కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తుందన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తి చేస్తామన్నా ఎన్నికల వాగాద్ధనం గాలికి వదిలేశారని చెప్పారు. విదేశాల్లో బడాబాబులు దాచుకున్న నల్లధనాన్ని తెచ్చి, ప్రతి పేదవాడి ఖాతలో రూ. 15 లక్షలు జమచేస్తానన్నా ఎన్నికల వాగాద్ధనం ఏమైందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితి మానావాభివృద్ధి సూచికలో 193 దేశాల్లో 130వ స్థానంలో ఉందని, దీనికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. ప్రజాస్వామ్యం, రాజకీయ స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన, సమన్యాయం, మత స్వేచ్ఛ, ఫెడరల్ స్పూర్తి, ఒకరకంగా చెప్పలంటే మొత్తంగా రాజ్యాంగాన్ని కి తూట్లు పొడిచి, రాజ్యాంగాన్ని గాలికి వదిలేసి పాలన చేస్తున్నారన్నారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాలను, మార్కెటింగ్ చట్టాలను కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా తీసుకువచ్చిందని మండిపడ్డారు. ఉమ్మడి జాబితా లో ఉన్న విద్యుత్, విద్య, వైద్యం, పన్నులు వసూళ్లు తదితర రంగాలను కబ్జా చేసిందని దుయ్యబట్టారు. 2014 లో 54 లక్షల కోట్లు అప్పు ఉండగా, అది ప్రస్తుతం 174 లక్షల కోట్లకు చేరిందని ఏద్ధేవా చేశారు. యుఎపిఎ, పిడి, ఇడి, సిబిఐ, పియంయల్ ఎ తదితర కేంద్ర ప్రభుత్వం అంగాలను ప్రయోగిస్తూ ప్రతిపక్ష, వివిధ రాజకియ పక్షరాలను, వ్యాపారవేత్తలను బెదిరించి బిజెపిలోకి తీసుకోవటం దారుణమన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత అదానీ, అంబానీ ఆస్తులు 10 లక్షల కోట్లుకు పెరిగిందని వివరించారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయన్నా పేరుతో వేలకు వేల ఎకరాలు రైతుల నుండి గుంజుకుని కార్పొరేట్ కంపెనీలకు, పారిశ్రామిక వేత్తలకు కట్టబెడుతున్నారని, రైతులను భూనిర్వాసితులను చేస్తున్నారని, వ్యవసాయ పంటల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ సాగుకు అవసరమైన మేజర్, మైనర్ ప్రాజెక్ట్ లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాటం లేదని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో కిసాన్ సంఘటన్ రాష్ట్ర కన్వీనర్ మరీదు ప్రసాద్ బాబు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *