Breaking News

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తో సుజనా చౌదరి ఆత్మీయ భేటీ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
వికసిత్ భారత్ -2047 కార్యక్రమంలో భాగంగా విజయవాడ వచ్చిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మరియు ప్రజా ప్రతినిధులతో మాజీ కేంద్ర మంత్రి వర్యులు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే (సుజనా చౌదరి) భేటీ అయ్యారు. పర్యటనలో భాగంగా తాడిగడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కు సుజనా చౌదరి శాలువా కప్పి, బొకే ఇచ్చి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం వారిని విందుకు ఆహ్వానించారు. ఈ విందు కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీ వీ ఎన్ మాధవ్, మెదక్ ఎంపీ రఘునందన్, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంటింటా నెట్‌జీరో… ఆదర్శ గ్రామాలే లక్ష్యం

-ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం -అలవరం కోడూరులో నెట్‌జీరో విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు మాడుగుల, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *