Breaking News

యువతే వికసిత్‌ భారత్‌కు చోదకశక్తి

-రాజకీయాల్లోకి వచ్చేవారు పదవుల కోసం కాదు.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి: గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌
-వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌తోనే వికసిత్‌ భారత్‌.. యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి: ఎపి బిజెపి చీఫ్ పీవీఎన్‌ మాధవ్‌

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
2047 నాటికి వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చే యువత పదవుల కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని సావంత్‌ సూచించగా.. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ ద్వారానే వికసిత్‌ భారత్‌ సాధ్యమని, రాష్ట్ర యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు.

బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ‘వికసిత్‌ భారత్‌ యంగ్‌ పొలిటికల్‌ లీడర్‌ డైలాగ్‌’ కార్యక్రమం తొలి రోజు విజయవాడలోని స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ కల్చరల్‌ సంస్థలో నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఎంపికైన యువ ప్రతినిధులు పాల్గొన్నారు.

రాజకీయ నాయకత్వానికి ఐదు సూత్రాలు

యువ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండటం, జవాబుదారీతనం, అందరినీ కలుపుకొని వెళ్లడం, నూతన ఆలోచనలతో పనిచేయడం, ‘నేషన్‌ ఫస్ట్‌’ అనే ఐదు సూత్రాలను పాటించాలని ప్రమోద్‌ సావంత్‌ సూచించారు. రాజకీయ నాయకత్వాన్ని వేదికలపై చేసే ప్రసంగాలతో కాకుండా క్షేత్రస్థాయిలో తీసుకొచ్చే మార్పులతో కొలవాలని అన్నారు.

యువత రాజకీయాల్లోకి రావడానికి ముందు విద్య, ఉద్యోగం లేదా వ్యాపారంలో అనుభవం సంపాదించడం మంచిదని చెప్పారు. యువ నాయకులు పాలసీ మేకర్లు, గ్రాస్‌రూట్‌ ఆర్గనైజర్లు, టెక్నాలజీ వినియోగదారులు, సామాజిక వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.

పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టాలన్న లక్ష్యాన్ని యువత భుజస్కంధాలపై తీసుకోవాలని అన్నారు. ‘సబ్కా సాత్‌–సబ్కా వికాస్‌–సబ్కా విశ్వాస్‌–సబ్కా ప్రయాస్‌’ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

వికసిత్‌ భారత్‌ సాధనకు ఆర్థిక సమ్మిళితం, మౌలిక వసతులు, ఆత్మనిర్భర తయారీ, సామాజిక సమానత్వం కీలకమన్నారు. జన్‌ధన్‌ నుంచి డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ వరకు వచ్చిన మార్పులు, రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాల విస్తరణ, స్వదేశీ తయారీ సామర్థ్యం వంటి అంశాలను వివరించారు.

భారత చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, భాష, కళలు, శాస్త్ర సాంకేతిక వారసత్వంపై యువత గర్వం పెంచుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను తెలుసుకుని వారి స్ఫూర్తితో దేశ నిర్మాణంలో ముందుకు సాగాలని అన్నారు.

గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌తో యువమోర్చా రోజుల్లో కలిసి పనిచేసిన అనుబంధాన్ని పీవీఎన్‌ మాధవ్‌ గుర్తుచేసుకున్నారు. ఆయుర్వేద వైద్యుడిగా కెరీర్‌ ప్రారంభించి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి గోవా ముఖ్యమంత్రిగా నిలిచిన సావంత్‌ను అభినందించారు. ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లను కూడా అభినందించారు.

ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ…రాబోయే భారతదేశం ఎలా ఉంటుందో మీ అందరిని చూడటానికి వచ్చాను. యువత దేశానికి పట్టు కొమ్మ. యువత ఏ రంగంలో ఉన్నా కానీ విలువలతో కూడిన జీవితాలు ఉండాలి. 2047 తో స్వాతంత్రం వచ్చి 100సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో యువత భవిష్యత్ లో కీలక పాత్ర వహించాలి.

ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ…యువత ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రతి యువతకి సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది. విలేజ్ ఇంటిలిజెన్స్ అనేది ఆర్టిఫిషల్ ఇనిలిజెన్స్ కంటే గొప్పది. హ్యూమన్ ఇంటిలిజెన్స్ అనేది అన్నిటికంటే గొప్పది. 2047 కల్లా మన దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనేది ప్రధాని మోదీ ఆకాంక్ష. అందుకు అనుగుణంగా మోదీ వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ పని చేస్తున్నారు. ప్రతి ఒక్కరు దేశం ముందు ఆ తర్వాతే మనం అనేది గుర్తుపెట్టుకోవాలి. మన యువత కి దేశాన్ని కాపాడుకునే సత్తా ఉంది. సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగించుకుని దేశ అభివృద్ధి లో యువత భాగస్వామ్యం కావాలి. ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్, హ్యూమన్ ఇంటిలిజెన్స్, విలేజ్ ఇంటిలిజెన్స్, పొలిటికల్ ఇంటిలిజెన్స్ లక్ష్యంతో యువత ఉండాలి.

బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ యువత భావోద్వేగాలకు లోనుకాకుండా బాధ్యతతో ఆలోచించాలని సూచించారు. “దేశం మనకు ఏమిచ్చిందనే దానికంటే.. దేశానికి మనం ఏమి ఇవ్వగలమనే ఆలోచన యువతలో రావాలి” అన్నారు. భారత్‌ను విశ్వగురుగా నిలపాలన్న స్వామి వివేకానంద కలను నరేంద్ర మోదీ సాకారం చేసే దిశగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌రెడ్డి సభకు అధ్యక్షత వహిస్తూ 2047 వికసిత్‌ భారత్‌ లక్ష్యంలో యువత ఆలోచనా విధానం అత్యంత కీలకమన్నారు. ప్రధాని గా మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. గ్రామస్థాయి నుంచి ప్రతి యువకుడు దేశ నిర్మాణంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నాగోతు హరికృష్ణ హరి కృష్ణ,బేతిరెడ్డి ఆదిత్య, అజేష్ యాదవ్,ఆదిత్య, పైడికొండల సింధు,నవ్య, తేజస్విని, నరేంద్ర వర్మ,నవీన్ , మోహన్ వంశీ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంటింటా నెట్‌జీరో… ఆదర్శ గ్రామాలే లక్ష్యం

-ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం -అలవరం కోడూరులో నెట్‌జీరో విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు మాడుగుల, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *