విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మత్తుకు బానిసలు గా మారుతున్న నేటి యువతను మేల్కొలిపి చైతన్య పరచడానికి తిరుపతి జిల్లాకు చెందిన సుదర్శన్ ఆటో యూనియన్ అధ్యక్షులు ఐ.ఎస్.ఖాజా ఒక కొత్త కార్యక్రమానికి రూపుదాల్చారు.విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు డ్రగ్స్ కి బానిసలుగా మారుతున్న యువతను చైతన్యపరచడానికి సౌత్ ఇండియా అంతటా కూడా యువ రథం ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు . నేటి సమాజంలో యువత డ్రగ్స్ కి గంజాయి లకి బానిసలుగా మారడం వల్ల రాష్ట్రంలో నేరాలు సంఖ్య రోజుకి పెరిగిపోతుందని ,తెలిసి తెలియని వయసులో అనేక నేరాలకు పాల్పడుతున్నారని ఆ మత్తులోనే వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్ గురవుతున్నారని వారిలో సరియైన శిక్షణ శిబిరాలు లేక ఇలా పెడదోమన పడుతున్నారని అన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రను ఆదర్శంగా తీసుకొని యువ రథం ఆలోచన పుట్టిoదనీ ఈ యాత్ర తిరుపతి నుండి మొదలుపెట్టామని నేడు అమరావతికి చేరుకుందని ప్రతి రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రిలను అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేస్తూ దాదాపు 570 కిలోమీటర్ల వరకు కొనసాగుతుందని తెలుగు,తెలంగాణ,కర్ణాటక, కేరళ, తమిళనాడు సరిహద్దుల మీదుగా యాత్రను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ యాత్ర వలన సమాజంలో కొంత అయినా మార్పు కనిపిస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. యువత సమాజానికి వెన్నెముక లాంటిదని అలాంటి యువత చెడు వ్యసనాలను వదిలి దేశ అభివృద్ధినీ ప్రగతి పథంలో నడుపుతారని ఈ యాత్ర ఎంతో దోహదపడుతుందని,యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తాగి వాహనాలు నడపడం కూడా చాలా ప్రమాదమని ఎలాంటి లాభపక్షా లేకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని అందరూ సహకరించాలని కోరారు.
Prajavartha Online Telugu News