Breaking News

వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్వాసితుల పునరావాసం, పరిహారం కోసం ఇప్పటికే రూ.518 కోట్లు విడుదల చేశాం

-నేడు మరో రూ.250 కోట్ల నిధులు మంజూరు చేశాం
-ఈ నెలాఖరు నాటికి నల్లమల సాగర్‌లోకి కృష్ణా జలాలు
-కృష్ణా జలాలకు ప్రజలంతా జలహారతులతో ఘన స్వాగతం పలకాలి
-మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వెలిగొండ పనులను పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ…వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్వాసితుల పునరావాసం, పరిహారం కోసం ఇప్పటికే రూ.518 కోట్లు విడుదల చేశాం. నేడు మరో రూ.250 కోట్ల నిధులు మంజూరు చేశాం. నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే వెలిగొండ పనులను పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. ఈ నెలాఖరు నాటికి నల్లమల సాగర్‌లోకి కృష్ణా జలాల తరలిస్తాం. వెలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తితో పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల తాగు, సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. 1996లో వెలిగొండ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన నారా చంద్రబాబు నాయుడే నేడు ముఖ్యమంత్రిగా ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం చారిత్రాత్మక ఘట్టం. పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన వెలిగొండ కృష్ణా జలాలను ఈ నెలాఖరులో విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధం. కృష్ణా జలాలకు ప్రజలంతా జలహారతులతో ఘన స్వాగతం పలకాలి. వెలిగొండ పూర్తితో ప్రకాశం పశ్చిమ ప్రాంతంలో వ్యవసాయం, తాగునీరు, ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపిరి అని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంటింటా నెట్‌జీరో… ఆదర్శ గ్రామాలే లక్ష్యం

-ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం -అలవరం కోడూరులో నెట్‌జీరో విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు మాడుగుల, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *