Breaking News

లేపాక్షి ఎంపోరియం షోరూంను సందర్శించిన డా. పసుపులేటి హరిప్రసాద్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
హైదరాబాద్‌లోని లేపాక్షి ఎంపోరియం షోరూంను ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా లేపాక్షి ఎంపోరియంలో ఏర్పాటు చేసిన హస్తకళా ఉత్పత్తులను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంప్రదాయ హస్తకళలు, కళాకారుల నైపుణ్యాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై షోరూం సిబ్బందితో చర్చించారు. లేపాక్షి ద్వారా రాష్ట్రంలోని కళాకారులు తయారు చేస్తున్న హస్తకళా ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ కల్పించడంతో పాటు, దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు మరింత గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందని డా. పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. హస్తకళాకారుల సంక్షేమం, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ అవకాశాల పెంపు, లేపాక్షి ఎంపోరియంల అభివృద్ధికి సంస్థ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ వేదికగా బ్రిక్స్ కొత్త క్రీడా బంధం ఆవిష్కరిద్దాం

-బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటుకు పిలుపు -బ్రిక్స్ దేశాల యువజన, క్రీడల మంత్రుల సాంస్కృతిక కార్యక్రమంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *