దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త :
దుగ్గిరాలలో గురువారం జరిగిన దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ పాలక వర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్సీ హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే పాల్గొన్నారు. తొలుత మండలంలోని పలు గ్రామాల్లో భారీ ర్యాలీ నడుమ చైర్మన్ మరియు డైరెక్టర్లు యార్డ్ కు చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మరియు ఎమ్మెల్సీ హనుమంతరావు లు ప్రసంగిస్తూ రైతులకి పాలక వర్గం అన్నివేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండల ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News