
– హై ఈనెల 25న ఉషారామలో హై అల్టిట్యూడ్ బెలూన్ శాట్ ప్రయోగం
– అంతరిక్ష పరోశోధనలపై అవగాహన కల్పించడమే లక్ష్యం
– ఉషారామ కాలేజీలో గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు
– ఉషారామ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీకేఎస్వీ ప్రసాద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతరిక్ష పరిశోధన, సంబంధిత శాస్త్ర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఉషారామ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీకేఎస్వీ ప్రసాద్ అన్నారు. నగరంలోని మేనర్ ఫుడ్ ప్లాజాలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అంతరిక్ష పరిశోధన రంగాల్లో మంచి భవిష్యత్తు ఉన్నందున, విద్యార్థులు రాణించేందుకు అవసరమైనజ్ఞానం, నైపుణ్యతలతో వారిని సన్నద్ధం చేయడం మన బాధ్యత అని వెల్లడించారు. స్పేస్ కిడ్జ్ ఇండియా సహకారంతో ఉషారామ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 25వ తేదీ ఆదివారం నాడు అంతరిక్ష, అంతరిక్ష అన్వేషణపై అవగాహన కల్పించేందుకు. అధిక ఎత్తులో ఉండే బెలూన్ ను సిద్దం చేశామని తెలిపారు. చిన్న ఉపగ్రహాలు, స్పేస్ క్రాఫ్ట్ లు, గ్రౌండ్ సిస్టమ్ రూపకల్పనలో స్పేస్ కిడ్జ్ భారతదేశంలోనే అగ్రగామిగా ఉందని చెప్పారు. విద్య పరిశోధన, పరిశ్రమల అవసరాలను తీర్చడానికి అంతరిక్షంలో ఆర్ధిక, స్థిరమైన లక్ష్యాలను సాధించడం వారి లక్ష్యమని అన్నారు. అంతరిక్షాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి, పొదుపు చేయడంలో భాగంగా హై అల్టిట్యూడ్ బెలూన్ ను, నానో ఉండే ఉపగ్రహాల ద్వారా విద్యార్థులకు ప్రయోగాత్మక అనుభవాన్ని అందిస్తూ, అంతరిక్ష విద్యను ప్రోత్సహించడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని వివరించారు. 25 మంది విద్యార్థులతో కూడిన బృందంస్పేస్ సైన్సెస్, టెక్నాలజీ, నానో రీటిలైట్, ఎంబడెడ్ సిస్టమ్ గురించి శిక్షణ పొందారని తెలిపారు. ఈ ఉషారామ శాట్ మిషన్ కు డైరక్టర్ గా అక్షయ్ విద్యార్ధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారని ప్రకటించారు. ఈ బెలూన్ ప్రారంభించడం వల్ల స్దానిక సమాజంలో ఆసక్తి, ఉత్సాహం ఏర్పడుతుందని, ఇది సానుకూల ప్రభావావాన్ని సృష్టిస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. శాస్త్రీయ ఆవిష్కరణలకు కేంద్రంగా ఉషారామ కీర్తించబడుతుందని డాక్టర్ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఉషారామ బృందాన్ని కళాశాల చైర్మన్ సుంకర రాంబ్రహ్మం అభినందించారు. ఈ సమావేశంలో కళాశాల చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కె. యజ్ఞసాయి, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రిఫత్ షారూక్, ఉషారామ బెలూన్ శాట్ మిషన్ డైరెక్టర్ అక్షయ్, స్పేస్ కిడ్జ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News