గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
ఆధునిక వసతులతో కౌన్సిల్ హాల్ ఆధునీకరించామని నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ యం.వేణుగోపాల్ రెడ్డి, కమీషనర్ కీర్తి చేకూరి, యం.యల్.సిలు లేళ్ళ అప్పిరెడ్డి, కే.యస్ లక్ష్మణ రావు, చంద్రగిరి యేసురత్నం, యం.యల్.ఎ లు మహమ్మద్ ముస్తఫా మరియు మద్దాలి గిరిధర్ లతో కలిసి ఆధునీకరించిన కౌన్సిల్ హాల్ ను మేయర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, గుంటూరు నగర పాలక సంస్థలో సర్వ సభ్య సమావేశాలు నిర్వహించుటకు 25 సంవత్సరాల క్రితం అప్పటి కౌన్సిలో సభ్యుల సంఖ్యను బట్టి నిర్మించుట జరిగిందని, కాని నేడు నగర విస్తీర్ణం పెరిగి సభ్యుల సంఖ్య పెరుగుటతో అవసరాలకు తగ్గట్టుగా కౌన్సిల్ హాల్ ను ఆధునీకరించుట జరగిందని తెలియచేశారు.సదరు కార్యక్రమంలో డిప్యూటి మేయర్లు వనమా బాల వజ్ర బాబు, షేక్ సజీల, అదనపు కమీషనర్ పెద్ది రోజా, డిప్యూటి కమీషనర్లు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నగర పాలక సంస్థ వివిధ విభాగాదిపతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News