Breaking News

వ్యవసాయ అనుబంధ ప్రభుత్వ అనుబంధ శాఖల సహకారం తో అభివృద్ధి పధకాలు అంది పుచ్చుకొని రైతులు ఆర్థిక అభివృద్ధి చెందాలి.

-జిల్లాలోను సూక్ష్మ ఆహార కుటీర పరిశ్రమలను మెరుగు పరచాలి.
– ప్రిన్సిపాల్ సెక్రటరీ ఫుడ్ ప్రాసెస్సింగ్ అగ్రి మార్కెటింగ్ & కో-ఆపరేటివ్ – చిరంజీవ్ చౌదరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయ అనుబంధ ప్రభుత్వ అనుబంధ శాఖల సహకారం తో అభివృద్ధి పధకాలు అంది పుచ్చుకొని రైతులు ఆర్థిక అభివృద్ధి చెందాలని ప్రిన్సిపాల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి అన్నారు.శుక్రవారంస్థానిక CTRI-ICAR సెమి నార్ హాల్, సూక్ష్మ ఆహార కుటీర పరిశ్రమలను ప్రచారం చేస్తూ రీజనల్ వర్క్ షాప్ కార్యక్రమం లో చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిరంజీవి చౌదరి మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ శాఖల ద్వారా రైతులకు వచ్చే రాయితీల పై అవగాహన కల్పించడం జరిగిం దన్నారు.రైతులకు వచ్చే అవకాశాలు,ప్రభుత్వం నుండి వచ్చే లబ్ది గురించి చర్చించి, పథకం లోని లబ్దిదారులు అందరకి ఎదుర య్యే కీలక సవాళ్ళను పరిష్కా రించడం ఎలా అనే దానిపై అవగాహన కల్పించామన్నారు. గత సంవత్సరము లో 120 పరిశ్రమలు స్థాపించాలని టార్గెట్ కాగా, 211 పరిశ్రమ లు స్థాపించడం జరిగిందన్నారు.2023-24 ఆర్ధిక సంవత్సరము లో లక్ష్యాలను చేరుకొనే దిశగా నిర్దిష్ట కార్యాచరణ రూపోందిం చడం జరిగిందన్నారు. పథకంలోని వ్యాపారవేత్తలకు జిల్లా పరిపాలనాతో ముందుకు వెళ్ళే మార్గన్ని నిర్ణయించడం జరిగిందన్నారు.జిల్లా రిసోర్స్ పర్సన్స్ మరియు లబ్దిదారులు హాజరు అయ్యా రు. పి.ఎం.ఎఫ్.ఇ. పథకం గురించి జిల్లా అధికారులకు అవగాహనా కల్పించటం జరిగింది.ఈ కార్యక్రమములో సీఈఓ, ఎ.పి.ఎఫ్. పి.ఎస్., ఎల్. శ్రీధర్ రెడ్డి, కే సుభాష్ కిరణ్, స్టేట్ లీడ్, ఎ.పి.ఎఫ్.పి.ఎస్., కె. స్వాతి, ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, ఎ.పి.ఎఫ్.పి.ఎస్., తూర్పు గోదావరి జిల్లా,బి.వి. రమణ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, కోనసీమ జిల్లా, ఎన్. మల్లిఖార్జునరావు, ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, కాకినాడ జిల్లా, ఎ.దుర్గేశ్, ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, పశ్చిమ గోదావరి జిల్లా మొదలగు వారు పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *