Breaking News

విద్యార్ధులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్  కె. ప్రత్యూష కుమారి పట్టణంలోని పలు సంక్షేమ వసతి గృహాలను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. ముందుగా గౌతమి జీవ కారుణ్య సంఘమును సందర్శించి వసతులను పరిశీలించి, వృద్ధులతో మాట్లాడారు. వారికి అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వసతి గృహవాసులకు సరైన ఆహారం, వైద్య సదుపాయాలు అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఎస్.టి. బాలికల సంక్షేమ వసతి గృహం, ఎస్.సి. బాలికల సంక్షేమ వసతి గృహం, ఎస్.టి. బాలుర సంక్షేమ వసతి గృహం, బి.సి. బాలుర సంక్షేమ వసతి గృహాలను సందర్శించి, భోజనశాలలను, పరిసరాలను, నివాస గదులను పరిశీలించారు. విద్యార్ధులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి తెలియ చెప్పారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *